ఉగ్రమూలలను తుదముట్టించాలనే లక్ష్యంతో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం పాక్ నిజస్వరూపం మరోసారి బయటపడింది. ఉగ్రవాదంతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని బుకాయిస్తూ వచ్చిన పాక్ ఇప్పుడు బోనులో నిలబడాల్సిన సమయం వచ్చింది. పహల్గం ఉగ్రదాడి పాక్ ప్రేరేపిత ఉగ్రదాడి అని దాయాది దేశం వైఖరిని భారత్ పదేపదే ఎండగట్టింది. దీంతో ఉద్దేశపూర్వకంగానే భారత్ ఈ ఆరోపణలు చేస్తుందన్న పాక్.. తన నిజస్వారూపాన్ని తనే తాజాగా బయటపెట్టుకుంది.
పాక్ ఆర్మీకి , టెర్రరిస్టులకు ఎంత దగ్గరి సంబంధాలు ఈ ఫోటో చూస్తూనే తెలిసిపోతోంది. మంగళవారం అర్ధరాత్రి పాక్ లోని 9ప్రాంతాల్లో భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. టార్గెట్ లను ఎంచుకొని మరీ మెరుపు దాడులు చేయడంతో 80మంది వరకు టెర్రరిస్టులు చనిపోయారని తెలుస్తోంది. అయితే , భారత్ దాడుల్లో హతమైన ఉగ్రవాదుల అంతక్రియలకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ అబ్దుల్ హాజరయ్యాడు. ఆయనతోపాటు పాక్ ఆర్మీ అధికారి కూడా హాజరై నివాళులు ఆర్పించడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, ఉగ్రవాదులు చనిపోతే .. వారి అంతక్రియాల్లో పాల్గొనాల్సిన అవసరం పాక్ ఆర్మీకి ఏంటి?అనే ప్రశ్న తెరమీదకు వస్తోంది. అంటే పాక్ ఆర్మీనే ఈ ఉగ్రభూతాన్ని ప్రోత్సహిస్తుందని భారత్ చేస్తోన్న వాదనకు బలం చేకూర్చినట్లు అయింది. పాక్ ఆర్మీకి – ఉగ్రవాదులకు ఉన్న అక్రమ సంబంధాన్ని పాక్ సైన్యమే బయటపెట్టుకొని ప్రపంచం ముందు దోషులుగా నిలబడింది.అందుకు పాక్ సైన్యమే కారణమవ్వడం విశేషం.