ఆసియా కప్‌ను బహిష్కరించలేక.. ఆడలేక ఆడుతున్న పాకిస్తాన్‌కు మరో ఇబ్బంది వచ్చి పడింది. 21 ఒకటో తేదీన మరోసారి భారత జట్టుతో తలపడాల్సి ఉంది. అది సెమీస్ ..నాకౌట్ మ్యాచ్. క్రికెట్లో గెలుపోటములు సహజమే కానీ.. ఇక్కడ పాకిస్తాన్ ముందే ఓడిపోతోంది. కనీసం కరచాలనం కూడా ప్రత్యర్థి ఆటగాళ్లు చేయకపోతూండటంతో వారు అవమానం పాలవుతున్నారు. ఈ పరిస్థితిని అవాయిడ్ చేయడానికి చేసిన ప్రయత్నాలు చాలా కాస్ట్లీగా మారడంతో చివరికి .. అవమానాలు భరించడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు.
యూఏఈతో మ్యాచ్ కు పాకిస్తాన్ గంట ఆలస్యంగా వచ్చింది. మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తే.. పీసీబీ పెద్ద ఎత్తున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే మ్యాచ్ రిఫరీని బహిష్కరించాలన్న డిమాండ్ ను వెనక్కి తీసుకుని విచారం వ్యక్తం చేస్తే చారని దిగి వచ్చింది. అయితే అది కూడా అనఫీషియల్ గా. అధికారికంగా మ్యాచ్ రిఫరీ ఎలాంటి క్షమాపణ చెప్పలేదు. చివరికి ఆండి పైక్రాఫ్ట్ రిఫరీగా ఉన్న మ్యాచ్ లోనే పాక్ ఆడాల్సి వచ్చింది.
ఇప్పటికే ఇండియాతో మ్యాచ్ లో ఘోరమైన ఓటమితో పాకిస్తాన్ లో టీమ్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆటగాళ్లు సరైన ప్రతిభను ప్రదర్శించకపోవడం.. టీమ్ ఇండియాతో ఆడుతున్నప్పుడు ఉండాల్సిన కసి కూడా లేకపోవడం వారిని బాధిస్తోంది. అదే సమయంలో టీమిండియా బలంగా ఉంది. పాకిస్తాన్ రాజకీయాల కారణంగా సిఫారసుతో ఆటగాళ్లు వచ్చి జట్టులో చేరుతూండటంతో ఆ జట్టు క్రమంగా బలహీనంగా మారుతోంది.