ఇంట్ర‌వెల్ బ్యాంగ్‌..హిలేరియ‌స్‌!

మారుతి అంటేనే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. ఏ హీరోతో సినిమా చేసినా… త‌న‌దైన మార్క్ వినోదం త‌గ్గ‌కుండా చూసుకుంటాడు. ఇప్పుడు గోపీచంద్ తో `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` సినిమా చేస్తున్నాడు. ఇది కూడా ఫుల్‌లెంగ్త్ కామెడీ సినిమానే అని… ట్రైల‌ర్లు, టీజ‌ర్లు చూస్తే అర్థ‌మైపోతోంది. ఈ సినిమాలో ఇంట్ర‌వెల్ బ్యాంగ్ అయితే.. హిలేరియ‌స్‌గా వ‌చ్చింద‌ని టాక్‌. సాధార‌ణంగా.. యాక్ష‌న్ మోడ్‌తో ఇంట్ర‌వెల్ బ్యాంగ్ వేస్తుంటారు. కానీ… మారుతి దాన్ని రివ‌ర్స్ చేసి, పూర్తి కామెడీ చేసేశాడ‌ట‌.

‘పక్కా క‌మ‌ర్షియ‌ల్‌’ ఇంట్ర‌వెల్ బ్యాంగ్‌లో.. ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల ఇంట్ర‌వెల్ బ్యాంగ్‌ల‌పై సెట‌ర్ ప‌డ‌బోతోంద‌ట‌. సాధార‌ణంగా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో ‘నీ అంతు సెకండాఫ్‌లో చూస్తా’ అంటూ హీరో, విల‌న్లు ఛాలెంజ్‌లు చేసుకోవ‌డం క‌నిపిస్తుంది. ఇందులో అలాంటి డైలాగుల్ని వాడుతూనే వాటిపై సెటైర్ వేశార‌ని టాక్‌. ఆ ఎపిసోడ్ మొత్తం హిలేరియ‌స్‌గా వ‌చ్చింద‌ట‌. ఇందులో రాశీఖ‌న్నా… ఓ టీవీ సీరియ‌ల్ ఆర్టిస్టుగా న‌టిస్తోంది. టీవీ సీరియ‌ళ్లు, అందులోని పాత్ర‌ల‌పై కూడా కామెడీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింద‌ని తెలుస్తోంది. టీవీ సీరియ‌ల్స్‌లో `లాగ్‌` ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. ఆ `లాగ్‌`పై కూడా మారుతి సెటైర్లు వేశాడ‌ని స‌మాచారం. మొత్తానికి `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`లో కామెడీ యాంగిల్ కావ‌ల్సినంత ఉంద‌ని, అది.. ఈ సినిమాని సూప‌ర్ హిట్ చేస్తుంద‌ని చిత్ర‌బృందం గ‌ట్టిగా న‌మ్ముతోంది. జులై 1న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గురి తప్పిన ట్వీట్… వైసీపీ ప్లాన్ బూమరాంగ్!

ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీ మనుగడనే ప్రశ్నార్ధకం చేసుకున్న వైసీపీ... సోషల్ మీడియా పుణ్యమా అని తన గోతిని తనే తవ్వి తీసుకుంటున్నట్లు కనబడుతోంది. కూటమి సర్కార్ ను టార్గెట్ చేయబోయి తన...

టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీ‌నివాస్

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ను నియమించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతోన్న అచ్చెన్నాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన స్థానంలో పల్లాకు పార్టీ పగ్గాలు అప్పగించినట్లు...

ప‌వ‌న్ ఇక సినిమాల‌కు గుడ్ బై చెప్పిన‌ట్లేనా?

డిప్యూటీ సీఎం... గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్, గ్రామీణ తాగునీటితో పాటు అడ‌వులు లాంటి కీల‌క శాఖ‌లు. అంటే ప్ర‌తిరోజు జ‌నంతో మ‌మేకం అయ్యే శాఖ‌లే. ప్ర‌తి రోజు అలుపెర‌గ‌కుండా ప‌ర్య‌టిస్తూ, రివ్యూలు చేస్తూ, నిర్ణ‌యాలు...

శాఖ‌ల కేటాయింపు… పొత్తుల్లో మోడీనే ఫాలో అయిన చంద్ర‌బాబు

రెండ్రోజులుగా ఎదురుచూస్తున్న మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు ఏపీలోనూ పూర్త‌యింది. గ‌తానికి భిన్నంగా ఈసారి శాఖ‌ల కేటాయింపు కాస్య ఆల‌స్య‌మైనా...స‌మ‌తుల్యంగా కేటాయించిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. అయితే, ఈ శాఖ‌ల కేటాయింపులో చంద్ర‌బాబు -మోడీ ఒకేవిధంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close