ప‌వ‌న్ పిలుస్తాన‌న్నాడ‌ట‌!

30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.. ఫృథ్వీరాజ్ రాజ‌కీయాల్లోనూ చ‌క్రం తిప్పాల‌ని చూసిన సంగ‌తి తెలిసిందే. వైకాపాలో చేరి, ఆ పార్టీ ప్ర‌చారం కోసం ముమ్మ‌రంగా తిరిగాడు. పృథ్వీరాజ్‌కి ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వ‌క‌పోయినా… తిదేపాలో ఓ కీల‌క ప‌దవి ఇచ్చింది వైకాపా. అయితే.. దాన్ని నిల‌బెట్టుకోలేక‌పోయాడు ఫృథ్వీరాజ్‌. కొన్ని అనూహ్య‌ప‌రిణామ‌ల మ‌ధ్య ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. ఇప్పుడు ఫృథ్వీ దృష్టిలో వైకాపా పెద్ద విల‌న్‌. ఆ పార్టీనీ, పార్టీ వైఖ‌రిని ఎండ‌గ‌డ‌తూ ఘాటు ఘాటు కామెంట్లు చేస్తున్నాడు. `బుద్ధి ఉన్న‌వాడెవ‌డూ ఆ పార్టీలో ఉండ‌డు` అంటూ మండిప‌డుతున్నాడు. అంతే కాదు. వైకాపాలో ఉన్న‌ప్పుడు ప‌వ‌న్‌ని తిట్టినందుకు ప్ర‌తీసారీ పశ్చాత్తాప ప‌డుతున్నాడు. ఇప్పుడు పృథ్వీరాజ్ దృష్టి జ‌న‌సేన‌పై ప‌డింద‌ని జ‌నాలంద‌రికీ అర్థ‌మ‌వుతూనే ఉంది. జ‌న‌సేనా జెండా మోసి, ఆ పార్టీ కోసం ప‌నిచేస్తాన‌ని పృథ్వీరాజ్ కూడా చెబుతున్నాడు. ఇదే విష‌యాన్ని ప‌వ‌న్ దృష్టికి తీసుకెళ్లాడ‌ట‌. ప‌వ‌న్ కూడా సానుకూలంగా స్పందిచాడ‌ట‌. “అవ‌స‌ర‌మైన‌ప్పుడు మిమ్మ‌ల్ని త‌ప్ప‌కుండా పిలుస్తా. ఈలోగా మీ సినిమాలు మీరు చేసుకోండి..`1` అని ప‌వ‌న్ మాట ఇచ్చేశాడ‌ని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంట‌ర్వ్యూలో మ‌న‌సులోని మాట చెప్పేశాడు పృథ్వీరాజ్‌. తూగో, ప‌.గోల నుంచి.. ఫృద్వీరాజ్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో ప‌వ‌న్ కి ఓ సామాజిక వ‌ర్గం నుంచి గ‌ట్టి మ‌ద్ద‌తు ఉంది. పృద్వీ కూడా ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన వాడే. కాబ‌ట్టి… జ‌న‌సేన టికెట్ పై గ‌ట్టిగా ఆశ‌లు పెట్టుకొన్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సైలెంట్‌గా సర్దేసుకుంటున్న వైసీపీ నేతలు

వైసీపీ నేతలు అటెన్షన్ డైవర్షన్ లో రాటుదేలిపోయారు. ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి రోజు మీడియా ముందుకు వచ్చి గెలుస్తాని నీరసంగా చెబుతున్నారు. అయితే అసలు స్కెచ్ మాత్రం వేరే...

లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆలస్యం…?

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం జూన్ చివరి వారంలోనే నిర్వహించాలనుకున్న రిజర్వేషన్ల అంశం ఎటూ తేలకపోవడంతో ఎన్నికలకు రెండు నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు...

కేబినెట్ విస్తరణ…రేసులో ఉన్నది వీరే..!?

తెలంగాణలో కేబినెట్ విస్తరణపై సందిగ్ధం నెలకొంది. మొదట లోక్ సభ ఎన్నికల తర్వాత ఖాళీగా ఉన్న ఆరు బెర్త్ లను భర్తీ చేస్తారని ప్రకటించినా ఇప్పుడు ఆ ఇష్యూ చర్చ రాకపోవడంతో కేబినెట్...

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close