ఎమ్మెల్సీగా పంచుమర్తి అనూరాధ గెలుపు!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ విజయం సాధించారు. సాంకేతికంగా టీడీపీకి 23 ఓట్లు ఉన్నాయి. అనూరాధకు కూడా 23 ఓట్లు వచ్చాయి. 22 ఓట్లు వస్తేనే ఓ అభ్యర్తి విజయం సాధించారు. అనూరాధకు ఓ ఓటు ఎక్కువే వచ్చింది. దీంతో ఆమె విజయం ఖరారయింది.

టీడీపీ తపపున 23 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ నలుగురు ఫిరాయించారు. అంటే 19 ఓట్లు మాత్రమే ఉన్నాయి. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. వారిలో ఇద్దరు ఎవరనేదానిపై అందరికీ క్లారిటీ ఉంది. వైసీపీ కూడా వారిని లెక్కలోకి తీసుకోలేదు. వారే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి. మరో ఇద్దరు వైసీపీతో పాటు క్యాంప్‌కు హాజరై .. సైలెంట్‌గా టీడీపీకి ఓట్లేశారు. వారెవరన్నది వైసీపీ నేతలకూ స్పష్టత లేకుండా పోయింది.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడు ఎమ్మెల్సీ సీట్లు గెలవాలని జగన్ పంతం పట్టారు. చాలా ఖర్చు పెట్టి హోటల్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యాంపులు నిర్వహించారు. ఓ అభ్యర్థికి ఇబ్బంది అయితే విశాఖ నుంచి ప్రత్యేక ఫ్లైట్ ఏర్పాటు చేశారు. కానీ మొత్తం శ్రమ బూడిదలో పోసిన పన్నీరయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్లు అర్జున్ చేతుల మీదుగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విన్న‌ర్ కిరీటాన్ని అందుకున్న సౌజ‌న్య

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విన్న‌ర్ కిరీటాన్ని అందుకున్న సౌజ‌న్య భాగ‌వ‌తుల‌ తెలుగు వారి హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్షించుకున్న తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తూ దూసుకెళ్తోన్న...

బీజేపీ, మోదీ మాటెత్తకుండానే కేసీఆర్ బహిరంగసభ ప్రసంగం !

కేసీఆర్ బహిరంగసభా వేదికపై గత రెండు, మూడేళ్లలో ఎక్కడ మాట్లాడినా ఆయన ప్రసంగంలో సగం బీజేపీ, మోదీని విమర్శించడానికే ఉండేది. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని బీజేపీ సంగతి చూస్తానని చెప్పేవారు ....

కాంగ్రెస్ పిలిస్తే కోదండరాం కూడా రెడీ !

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పని చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. తాజాగా కోదండరాం కూడా రెడీ అయ్యారు. తెలంగాణ పరిరక్షణకు.. ప్రజాస్వామ్య తెలంగాణకు టీజేఎస్ కృషి చేస్తోందని..తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడంకోసం తెలంగాణ...

నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి!

ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేసే టీడీపీ నేతల ఇళ్లపైకి రౌడీముకల్ని పంపి దాడులు చేయించడం ... పోలీసులు చూస్తూ ఉండటం కామన్ గా మారిపోయింది. గతంలో పట్టాభి ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close