నిన్ను కోరి, మజిలీ చిత్రాలతో సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు శివనిర్వాణ. ఇప్పుడు విజయ్ దేవరకొండ, సమంత తో ఖుషీ సినిమా రూపొందిస్తున్నాడు. సెప్టెంబర్ 1న రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చాలా ఆసక్తికరంగా వుంది.
పోస్టర్ పై రెండు ప్రపంచాలని రాశారు. దీంతో సినిమా టైం ట్రావెలర్ అని , అద్భుతం సినిమాల రెండు కాలాలకి సంబధించినదని కొన్ని ఊహాగానాలు వినిపించాయి. అయితే అసలు సంగతి అది కాదు. దేవుడుపై వున్న నమ్మకాలపై సాగే కథని తెలిసింది.
దేవుడు అంటే నమ్మకం వున్న ఓ పాత్ర, డానికి విరుద్దంగా వుండే మరో పాత్ర మధ్య నడిచే కథ ఇది. శివనిర్వాణ చాలా క్లాస్ గా దిన్ని డీల్ చేశారు. ఇందులో కాశ్మీర్ నేపధ్యం కూడా వుంది. అదే ఎందుకో ఇప్పటికి సస్పెన్స్. విజయ్. సమంత ల కెమిస్ట్రీ సచాలా కొత్తగా వుంటుందని, ప్రేమ కథని చాల హార్ట్ టచ్చింగా తీర్చిదిద్దాడట శివ నిర్వాణ. అన్నట్టు ఇందులో సమంత పేరు ఖుషి. అదే సినిమా టైటిల్ గా పెట్టారు.