క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారిపై సరైన సమయంలో చర్యలు : సజ్జల

వైసీపీ నుంచి టీడీపీకి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారెవరో గుర్తించామని కానీ వెంటనే చర్యలు తీసుకోబోమని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. వెంటనే చర్యలు తీసుకోవడానికి ఇదేమీ ఉద్యోగం కాదని రాజకీయమని చెప్పుకొచ్చారు. తప్పు చేశారని తెలిసిన తర్వాత కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేనంత దుర్భర పరిస్థితికి వైసీపీ వెళ్లిపోవడం ఆ పార్టీ నేతల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది.

మొత్తంగా నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి ఓట్లు వేశారు. ఆ నలుగురిలో ఇద్దరు బహిరంగంగా పార్టీని ధిక్కరించారు. మరో ఇద్దరు ఎవరనేది తెలుసుకునే ఉంటారు. ఆ నలుగుర్ని సస్పెండ్ చేయడం లేదా.. పార్టీ నుంచి బహిష్కరించడం ఇంకా చెప్పాలంటే అనర్హతా వేటు వేసే అధికారం కూడా వైసీపీ చేతుల్లో ఉంది. కానీ ఏ చర్యా తీసుకోలేకపోతున్నామని సజ్జల చెబుతున్నారు. ఇప్పుడు వైసీపీ అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉందని గెలుక్కుంటే.. మొదటికేమోసం వస్తుందని ఆయన భావిస్తున్నట్లుగా ఉన్నారు.

ఈ పరిణామాలపై వైఎస్ఆర్‌సీపీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలపై సీఎం జగన్ పట్టు కోల్పోయారా అన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ ఓటమిపై ఇంకా వైఎస్ఆర్‌సీపీ ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తామనుకున్న ఎమ్మెల్సీ సీట్లలో ఓడిపోవడంతో వైసీపీ క్యాడర్ నిరాశలో కూరుకుపోయింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు ఐదుగురు ఓట్లేసినా తమ ఎమ్మెల్యేలే క్రాస్ ఓటింగ్ చేయడం వారిని ఇబ్బంది పెడుతోంది. తమ పరిస్థితి అయిపోయిందన్న అభిప్రాయానికి వైసీపీ నేతలు వస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్లు అర్జున్ చేతుల మీదుగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విన్న‌ర్ కిరీటాన్ని అందుకున్న సౌజ‌న్య

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విన్న‌ర్ కిరీటాన్ని అందుకున్న సౌజ‌న్య భాగ‌వ‌తుల‌ తెలుగు వారి హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్షించుకున్న తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తూ దూసుకెళ్తోన్న...

బీజేపీ, మోదీ మాటెత్తకుండానే కేసీఆర్ బహిరంగసభ ప్రసంగం !

కేసీఆర్ బహిరంగసభా వేదికపై గత రెండు, మూడేళ్లలో ఎక్కడ మాట్లాడినా ఆయన ప్రసంగంలో సగం బీజేపీ, మోదీని విమర్శించడానికే ఉండేది. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని బీజేపీ సంగతి చూస్తానని చెప్పేవారు ....

కాంగ్రెస్ పిలిస్తే కోదండరాం కూడా రెడీ !

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పని చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. తాజాగా కోదండరాం కూడా రెడీ అయ్యారు. తెలంగాణ పరిరక్షణకు.. ప్రజాస్వామ్య తెలంగాణకు టీజేఎస్ కృషి చేస్తోందని..తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడంకోసం తెలంగాణ...

నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి!

ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేసే టీడీపీ నేతల ఇళ్లపైకి రౌడీముకల్ని పంపి దాడులు చేయించడం ... పోలీసులు చూస్తూ ఉండటం కామన్ గా మారిపోయింది. గతంలో పట్టాభి ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close