లిక్కర్ కేసు కన్నా పేపర్ లీకేజీతోనే అసలు గండం !

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ పరీక్షల లీకేజీల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. ఎన్నో ఏళ్ల తర్వాత ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్లన్నింటిపై అనుమానాలు వచ్చేలా ఈ వ్యవహారం చేసింది. దీంతో అసలు ఆగ్రహంతో ఉన్న నిరుద్యోగులు మరింతగా ప్రభుత్వంపై మరింత ఫైర్ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు వారిలో విశ్వాసం నెలకొల్పాల్సిన పరిస్థితి ప్రభుత్వంలో ఏర్పడింది. ఇందు కోసం కఠిన చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ నిరుద్యోగులకు నమ్మకం కలిగిస్తూ పరీక్షలు ఎలా నిర్వ హంచాలన్న అంశంపై కేసీఆర్ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రద్దు చేసిన పరీక్షలను ఇప్పటికిపుడు మళ్లి పెట్టినా అనుమానాలు చెలరేగే ప్రమాదం ఉందనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. అన్ని పరీక్షలు రద్దుచేసి అత్యంత పారదర్శక విధానం తీసుకురావాలని, 90 రోజుల్లో పరీక్షలు పూర్తిచేయాలనే ఆలోచనతో సీఎం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

పేపర్ల లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఓ వైపు లిక్కర్ కేసులో కవిత విచారణ ఎదుర్కొంటున్నారు. కవిత ఈడీ ఆఫీసుకు విచారణకువెళ్తే సీనియర్ మంత్రులు ఢిల్లీలోనే ఉంటున్నారు. దీంతో విపక్షాల విమర్శలకు ఎదురుదాడి చేయడం తగ్గిపోయింది. తెలంగాణలోని ప్రతీ అంశంపై తనకంటే ఎక్కువ బాధ్యత ఎవరికీ లేదని, ఉద్యమనేతగా తనకే ఇక్కడి యువతపై బాధ్యత ఉందని.. నమ్మకం కలి గించేందుకు కేసీఆర్ సందర్భం లేకపోయినా సోమవారం బహిరంగ లేఖ రాశారన్న అభిప్రాయం వినిపిస్తోంది ఓ వైపు కవితపై లిక్కర్ కేసులో విచారణ.. మరో వైపు ప్రభుత్వానికి అప్రతిష్ట వచ్చే ప్రమాదం ఉండడంతో దీని తీవ్రతను తగ్గించేందుకు సీఎం కేసీఆర్‌ సెంటిమెంట్ ప్రయోగిస్తున్నారని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మహానాడు : టీడీపీ 6 హామీలతో భవిష్యత్‌కు గ్యారంటీ !

మహానాడులో తెలుగుదేశం పార్టీ ప్రజలకు సంక్షే్మ రంగంలో ఆరు హామీలు ప్రకటించింది. భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో మినీ మేనిఫెస్టోని చంద్రబాబు ప్రకటించారు. నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు టీడీపీ...

ఎన్టీఆర్‌ను వైసీపీ స్మరించుకుంది.. చంద్రబాబును తిట్టడానికైనా సరే!

ఎన్టీఆర్ అందరి మనిషి. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సహజంగానేకొంత మందికి దూరంఅవుతారు. అలా దూరమైన వారు కూడా ప్రత్యేక సందర్భాల్లో దగ్గర చేసుకోక తప్పదు. ఎన్టీఆర్‌ను అలా దగ్గర చేసుకోవాల్సిన ప...

బాలయ్య కోసం కొత్త ప్ర‌పంచం సృష్టిస్తాడ‌ట‌

అ, క‌ల్కి, జాంబిరెడ్డి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఇప్పుడు హను-మాన్ రూపొందిస్తున్నాడు. తేజా స‌జ్జా క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది. ఈలోగా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేసే...

అందరికీ బెంచ్ మార్క్ బిల్డింగ్‌లు – ఏపీ జనానికి మాత్రం బటన్లు !

తెలంగాణ ప్రభుత్వం ఓ పెద్ద సెక్రటేరియట్ కట్టుకుంది. కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇప్పుడు కేంద్రం పార్లమెంట్ నిర్మించింది.. అంత కంటే ఎక్కువ కథలు చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ రెండు నిర్మాణాలూ అవసరం లేదని..దుబారా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close