రివ్యూ : దాస్ కా ధమ్కీ

Das Ka Dhamki Movie Telugu Review

రేటింగ్‌: 2.25/5

ఒకే పోలికలతో వున్న రెండు పాత్రల నేపధ్యంలో అనేక కథలు వచ్చాయి. డబుల్ యాక్షన్ తెలుగు సినిమాకి ఎవర్ గ్రీన్ ఫార్మూలానే. దాస్ కా ధమ్కీ ట్రైలర్ లో ఇది డబుల్ యాక్షన్ కథని చెప్పారు. అయితే విశ్వక్ సేన్ లాంటి నటుడు, దర్శకుడు నుంచి వస్తున్న డబుల్ యాక్షన్ కావడంతో దీనిపై ఆసక్తి పెరిగింది. పైగా ఈ సినిమాని ఆయనే స్వయంగా నిర్మించారు. ‘’కథ బావుంది. ఎలాగైనా ఈ కథని ప్రేక్షకులని చూపించాలని చాలా రిస్క్ తీసుకొని, ఉన్నదంతా పెట్టేసి ఈ సినిమా తీశాను’ అని ప్రమోషన్స్ లో చెప్పి ఇంకాస్త ఆసక్తిని పెంచాడు విశ్వక్. మరి విశ్వక్ ఇంతా రిస్క్ తీసుకొని నిర్మించదగ్గ దాస్ కా ధమ్కీ కథ ఏంటి ? ఈ డబుల్ యాక్షన్ ప్రేక్షకులుని ఎలా ఆకట్టుకుంది ? నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా విశ్వక్ చేసిన త్రిపాత్రాభినయం ఎంతలా మెప్పించింది ?

కృష్ణ దాస్ (విశ్వక్ సేన్) ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో వెయిటర్. తను చేస్తున్న పని తనకి ఏ మాత్రం నచ్చదు. ‘పేదోడిగా పుట్టించేమో గానీ పేదోడిగా మాత్రం చచ్చిపోకూడదు. ఎప్పటికైనా రిచ్ కావాలి’ అనే ఆశతో బ్రతుకుతుంటాడు కృష్ణ. రెండు నెలల జీతం పోయినా పర్లేదని స్నేహితులతో అదే హోటల్ కి కస్టమర్ గా వెళ్తాడు. అక్కడ కీర్తి(నివేదా పేతురాజ్) పరిచయమౌతుంది. కృష్ణ చూసి బాగా ధనవంతుడు అనుకుంటుంది కీర్తి. తనతో స్నేహం చేస్తుంది. కీర్తి ప్రేమని పొందడానికి ధవంతుండిగా నటిస్తాడు కృష్ణ. మరోవైపు అచ్చు కృష్ణ పోలికలతో వున్న సంజయ్ రుద్ర (విశ్వక్ డబుల్ యాక్షన్) ఓ ఫార్మా కంపనీని సిఈవో. క్యాన్సర్ కి విరుగుడు మందు కనిపెడతాడు. తన కల తీరుతున్న సమయంలో ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. దీంతో సంజయ్ స్థానంలో వచ్చిన కృష్ణ దాస్ కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ? తను ధవవంతుడు కాదనే సంగతి కీర్తికి తెలిసిందా ? అసలు సంజయ్ చావుకి కారణం ఎవరు ? అనేది మిగతా కథ.

రాముడు భీముడు నుంచి మొన్న వచ్చిన అమిగోస్ వరకూ అనేక డబుల్ యాక్షన్ సినిమాలు చూశారు ప్రేక్షకులు. విశ్వక్ నుంచి డబుల్ యాక్షన్ సినిమా వస్తుందతే ఖచ్చితంగా ఇది వరకూ ఎప్పుడూ చూడని ఎదో కొత్త పాయింట్ ఇందులో ఉంటుందని అంచనా సహజంగానే వుంటుంది. ఈ డబుల్ యాక్షన్ లో వున్న కొత్త పాయింట్ ఏమిటంటే.. ఒక కథలో రెండు జోనర్ లు చూపించడం. సినిమా ప్రధమార్ధం కమర్షియల్ ఎలిమెంట్స్ తో కామెడీ ఎంటర్ టైనర్ అనిపిస్తే.. రెండో సగం మాత్రం ‘అతి’ మలుపులతో థ్రిల్లర్ అనిపిస్తుంది. ఈ రెండిటిని కలిపి చూస్తే.. మాత్రం ‘దాస్ కా ధమ్కీ’ యావరేజ్ ప్రయత్నంగా మిగిలిపోతుంది.

పాత్రల పరిచయం తర్వాత ఎంతోకొంత కథని ఓపెన్ చేయాలి. అప్పుడే.. ప్రేక్షకుడు ఆ పాత్రలతో ప్రయాణిస్తాడు. ధమ్కీ లో వున్న ప్రధాన సమస్య ఏమిటంటే.. సెకండ్ హాఫ్ వరకూ అసలు ఇందులో కథ ఏమిటి ? అనే క్వశ్చన్ మార్క్ పేస్ తోనే వుండిపోతాడు ప్రేక్షకుడు. తొలి సగంలో కథ లేనప్పుడు బలమైన వినోదమైన రాసుకోవాలి. కానీ అదీ జరగలేదు. తను రిచ్ పర్శన్ అని నమ్మించడానికి హీరో చేసే ప్రయత్నాలు..ఇప్పటికే కొన్ని వందల సినిమాల్లో చూశాం. విశ్వక్ కూడా అదే ట్రాక్ ని వాడుకున్నాడు. వాడుకోవడంలో తప్పులేదు.. కానీ సన్నివేశం కొత్తగా అనిపించాలి. కానీ అలా జరగలేదు. హైపర్ ఆది, మహేష్ పాత్రలతో జబర్దస్త్ సింగెల్ లైనర్స్ చెప్పి నవ్వించాలనే ప్రయత్నం పెద్దగా నవ్వించలేదు. హీరో హీరోయిన్ ట్రాక్ లో కూడా ఫ్రెష్ నెస్ కనిపించలేదు.

అసలు కథ సెకండ్ హాఫ్ లో మొదలుపెట్టిన విశ్వక్ ఆరంభంలో ఆసక్తిగానే నడుపుతారు. ఫస్ట్ హాఫ్ తో పొంతన లేకుండా సెకండ్ హాఫ్ లో ఓ థ్రిల్లర్ తెరపైకి వస్తుంది. మలుపులతో ప్రేక్షకులని ఉక్కిరిబిక్కిరి చేసేయాలనే ఆలోచన మంచిదే. అయితే ట్విస్ట్ అనేది ప్రేక్షకుడికి అనిపించాలి. కానీ ఇందులో చాలా ట్విస్ట్ లు పది నిమిషాలకు ముందే ప్రేక్షకులు అర్ధమౌపొతుంటాయి. ఒకసారి ఇది చీటింగ్ స్క్రీన్ ప్లే అని తెలుసుకున్న తర్వాత.. ప్రతి పాత్ర కూడా తేలిపోయి తర్వాత ఏం జరుగుతుందో అనే ఎక్సయిట్ మెంట్ తగ్గిపోతుంది. ల్యాబ్ లో నడిపిన డార్క్ రూమ్ డ్రామా సహనానికి పరీక్షపెడుతుంది. పైగా ఆ ఎపిసోడ్స్ లో మితిమీరిన హింస చిరాకు పెడుతుంది. ఇందులో కొన్ని మలుపులు వున్నాయి. అయితే అవేవి .. వావ్ అనుకునే మలుపులు కాలేకపోయాయి.

క్రైమ్ థ్రిల్లర్స్ చూసే ప్రేక్షకులు చాలా తెలివిగా వుంటారు. క్రైమ్ సీన్ ని ఎంత ఆసక్తికరంగా చూపిస్తే క్రైమ్ సీన్ చుట్టూ జరిగిన సంఘటనలు అంత ఆసక్తిని పెంచుతాయి. కానీ ఇందులో క్రైమ్ సీన్ బలంగా వుండదు. తెరపై జరిగిన తంతు చూస్తే.. ఆడియన్స్ కు ఇంతలోతుగా అలోచించే తెలివి వుండదనుకునే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఇలాంటి ట్రీట్ మెంట్ చేశారా ? అనే అభిప్రాయం కలుగుతుంది. ఈ సినిమాలో చివర్లో ఒక సర్ప్రైజ్ వుందని చెప్పాడు విశ్వక్. అదేంటో కాదు దీనికి పార్ట్ 2 వుంది. దాని కోసం ఒక భారీ సీన్ కండక్ట్ చేశారు. బడ్జెట్ పెరగడం తప్పితే ఆ సీన్ వలన కలిగిన ప్రయోజనం లేదు.

విశ్వక్ సేన్ సహజంగా కనిపించే నటుడు. రెండు పాత్రలని కూడా సహజంగా చేశాడు. అయితే ఈ కథ పెద్ద యాక్షన్ ని డిమాండ్ చేయదు. దీంతో తెరపై వచ్చిన యాక్షన్ సీన్లు అవసరం లేదనే ఫీలింగ్ కలిగిస్తాయి. తన లుక్ బావుంది కానీ కంటిన్యూటీ లేదు. తన హెయిర్ స్టయిల్, గెడ్డం ఒకొక సన్నివేశంలో ఒకొక్కలా కనిపిస్తుంది. నివేదా గ్లామరస్ రోల్ లో కనిపించింది. అయితే నటనలో ఆమె ప్రజన్స్ తగ్గింది. హైపర్ ఆది, మహేష్ సింగెల్ లైనర్స్ తో నవ్వించే ప్రయత్నం చేశారు. రావు రమేష్ పాత్ర రెగ్యులర్ గా వుంది. రోహిణి వీల్ చైర్ కి పరిమితమైన పాత్రే అయినప్పటికీ .. ఆ పాత్రలో ఎదో ఒక ఎమోషన్ ఉందనే ఫీలింగ్ అయితే కలిగించింది. అజయ్ ది గెస్ట్ రోల్ లాంటి పాత్ర. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.

టెక్నికల్ గా సినిమా బావుంది. ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా క్యాచిగా వుంది. నేపధ్య సంగీతం హెవీగా ఇచ్చారు కానీ దానికి తగిన ఎమోషన్స్ సీన్స్ యాడ్ అవ్వలేదు. దీంతో చాలా సన్నివేశాలని నేపధ్య సంగీతం డామినేట్ చేసినట్లుగా వుంటుంది. కెమరాపనితనం రిచ్ గా వుంది. ఫైవ్ స్టార్ హోటల్ తీసిన సీన్స్ లావిష్ గా కనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో చాలా వరకూ ఒక డార్క్ ల్యాబ్ లో కథని నడిపించారు. గుర్తుపెట్టుకునే మాటలైతే లేవు. విశ్వక్ డబుల్ యాక్షన్ ఓకే కానీ .. డైరెక్షన్ కి మాత్రం సంపూర్ణ న్యాయం చేయలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ లో ఎంటర్ టైన్ మెంట్, సెకండ్ హాఫ్ లో మలుపులని నమ్ముకొని చేసిన సినిమా ఇది. అయితే ఈ రెండూ కూడా యావరేజ్ దగ్గరే ఆగిపోయాయి.

రేటింగ్‌: 2.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close