అఖిల్ – ప‌ర‌శురామ్‌… అంతా తూచ్‌!

గీత గోవిందం త‌ర‌వాత ప‌ర‌శురామ్ సినిమా ఏదీ ప‌ట్టాలెక్క‌లేదు. వంద కోట్ల సినిమా ఇచ్చిన ద‌ర్శ‌కుడు ఖాళీగా ఉండ‌డం ఏమాత్రం భావ్యం కాదు. కాక‌పోతే ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఆయ‌న చేస్తూనే ఉన్నారు. మ‌హేష్‌కి ఓ క‌థ చెప్పి, ఓకే చేయించుకున్నాడు. కానీ అదెప్పుడు ప‌ట్టాలెక్కుతుందో తెలీదు. ఆ సినిమా ఆల‌స్యం అయ్యే కొద్దీ – ఈ కాంబోపై అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. దాంతో ర‌క‌ర‌కాల న్యూస్‌లు.

తాజాగా అఖిల్‌తో ప‌ర‌శురామ్ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ సినిమాకి బడ్జెట్ ఎక్కువ అవుతుంద‌ని, అందుకే నాగార్జునే స్వ‌యంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి రంగంలోకి దిగిన‌ట్టు వార్త‌లు వ‌చ్చేశాయి. మ‌హేష్ క‌థ‌నే, అఖిల్ కోసం మార్చి రాసుకున్నాడ‌ని కూడా చెప్పుకున్నారు. అయితే.. ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని తేలిపోయింది. అఖిల్‌తో సినిమా అనే ప్ర‌తిపాద‌న త‌న ద‌గ్గ‌ర‌కేం రాలేద‌ని, త‌ను పూర్తిగా మ‌హేష్ సినిమా ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యాన‌ని, ఇలాంటి వార్త‌ల్ని న‌మ్మొద్ద‌ని చెబుతున్నారు ప‌ర‌శురామ్. మ‌రి నిప్పు లేకుండా ఈ పొగ ఎలా పుట్టింది చెప్మా??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com