మ‌రోసారి రాజ‌ధానిపై బొత్స స‌త్య‌నారాయ‌ణ కీల‌క‌ వ్యాఖ్య‌లు..!

అమ‌రావ‌తి రాజ‌ధానిపై పుర‌పాల‌క శాఖ‌ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మ‌ళ్లీ సంచల‌న వ్యాఖ్య‌లు చేశారు! గ‌తంలో తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని అన్నారు. విజ‌య‌న‌గ‌రంలో ఆయ‌న విలేకరుల‌తో మాట్లాడుతూ… రాజ‌ధాని అంశం ప్ర‌భుత్వ ప‌రిశీల‌న‌లో ఉంద‌న్నారు. బాధ్య‌తాయుత‌మైన మంత్రి ప‌ద‌విలో ఉంటూనే తాను ఈ వ్యాఖ్య‌లు చేస్తున్నాన‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. రాజ‌ధాని ఏ ఒక్క సామాజిక వ‌ర్గానిదో కాద‌నీ, ప్ర‌జ‌లంద‌రిదీ అని చెప్పారు. కృష్ణా న‌దిలో 8 క్యూసెక్కుల నీరు వస్తేనే రాజ‌ధాని మునిగిపోయింద‌నీ, 11 క్యూసెక్కులు వ‌స్తే ప‌రిస్థితి ఏంట‌న్నారు బొత్స‌. గ‌తంలో కూడా వ‌ర‌ద‌లు వ‌చ్చిన ప‌రిస్థితులున్నాయ‌న్నారు.

శివ‌రామ‌కృష్ణ క‌మిటీని మ‌ళ్లీ ప్ర‌స్థావిస్తూ ఆ నివేదిక‌‌ని గ‌త టీడీపీ ప్ర‌భుత్వం పాటించ‌లేద‌నీ, మంత్రి నారాయ‌ణ మాట‌ల్ని చంద్ర‌బాబు విని అమ‌రావ‌తిని ఎంపిక చేశార‌ని మ‌రోసారి విమ‌ర్శించారు. ప్ర‌భుత్వానికి ఆర్థికంగా కూడా భారం ఎక్కువౌతోంద‌నీ, బ‌య‌ట ప్రాంతాల్లో రూ. 1 ల‌క్ష‌ల‌కు పూర్త‌య్యే ఒక‌ ప‌నిని అమ‌రావ‌తిలో చేప‌డితే రూ. 2 ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతుంద‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్ర‌భుత్వానికి భార‌మ‌య్యే ప‌రిస్థితి ఉంద‌నీ, ఇవ‌న్నీ ప్ర‌భుత్వ ప‌రిశీల‌న‌లో ఉన్నాయ‌ని చెప్పారు. తాను మొన్న చెప్పిందీ ఇదే అనీ, ఇప్పుడూ అదే మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని బొత్స మ‌రోసారి అన్నారు. రాజ‌ధానిపై ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పంద‌న చూశాన‌నీ, అవి ద్వంద్వ అర్థాలు ఇచ్చేవిగా ఉన్నాయ‌ని బొత్స వ్యాఖ్యానించారు.

మొత్తానికి, మ‌రోసారి రాజ‌ధానిపై అనిశ్చిత వ్యాఖ్య‌లే చేశారు బొత్స‌. వైకాపా ప్ర‌భుత్వం ఓ నిర్ణ‌యంతో ఉంద‌నే సంకేతాలు మ‌రింత బ‌లంగా ఇచ్చారు. అయితే, గ‌త‌వారంలో ఆయ‌న ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేసి… ఓ ఐదు రోజుల‌పాటు మీడియాకి దూరంగా ఉన్నారు. ఈలోగా జ‌ర‌గాల్సిన చ‌ర్చంతా జ‌రిగింది, రాజ‌ధాని అమ‌రావ‌తిలోనే ఉంటుందా అనే అనుమానాలు రేకెత్తాయి, రాజ‌ధాని ప్రాంత రైతులు కూడా పార్టీల‌కు అతీతంగా అంద‌ర్నీ క‌లుస్తూ గోడు వెళ్ల‌బోసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో మొన్ననే బొత్స ఏమన్నారంటే… ఇదంతా మీడియా వ‌క్రీక‌ర‌ణ‌, తెలుగుదేశం పార్టీ దుష్ప్ర‌చారమ‌ని యూట‌ర్న్ తీసుకున్నారు. ఇవాళ్ల మ‌ళ్లీ,… తూచ్, వ‌క్రీక‌ర‌ణ వ్యాఖ్య‌లు ఉత్తుత్తినే అన్న‌ట్టు మాట్లాడుతూ, రాజ‌ధాని విష‌యంలో ప్ర‌భుత్వం గ‌ట్టిగానే ఆలోచిస్తోందంటూ మ‌ళ్లీ ఇవాళ్ల మ‌రో యూ ట‌ర్న్ తీసుకున్నారు! బాధ్య‌తాయుత‌మైన మంత్రిగా ఈ వ్యాఖ్య‌లు చేస్తున్నాన‌ని మ‌రీ చెప్పుకున్నారు. నిజంగానే అంత బాధ్య‌త ఫీలైతే… ఐదు కోట్ల ప్ర‌జ‌ల రాజ‌ధానికి సంబంధించిన అంశంపై ఇలా పూట‌కోమాట మాట్లాడ‌టం స‌రైందా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close