పార్లమెంట్ గడపతొక్కబోతున్న `అసహనం’

ఇంతకాలంగా దేశంలో అక్కడక్కడా కనిపించిన `అసహనం’ ఇప్పుడు నేరుగా పార్లమెంట్ గడపతొక్కబోతున్నది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా గత ఆరెనిమిది నెలలుగా దేశంలో అసహనం పేరుకుపోయిందనీ, దేశ పౌరులకు భద్రత లోపించిందనీ, తన భార్యకూడా దేశం విడిచి వెళ్ళిపోదామంటూ చేసిన వ్యాఖ్యలు- పార్లమెంట్ లో సైతం ప్రాధాన్యత సంతరించుకోబోతున్నాయి. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి కొద్దిరోజుల ముందు అమీర్ ఖాన్ వ్యాఖ్యానించడం, దానికి రాహుల్ గాంధీ వత్తాసు పలకడం, ఆపైన ఇటు కాంగ్రెస్, అటు బిజెపీ నేతలు కామెంట్లు చేస్తుండటంతో `అసహనం’ అగ్గి మరోసారి రాజుకుంది. అమీర్ ఖాన్ చేత ఈ `అసహనపు’మాటలు ఏ రాజకీయశక్తులైనా అనిపించాయా?, లేక నిజంగానే ఆయనే అన్నారా?-అన్నది ఇప్పటికి అప్రస్తుతం. ఎందుకంటే ఆయన మెసేజ్ చేరాల్సినవారికి చేరింది. ఇక పార్లమెంట్ సాక్షిగా వాగ్యుద్ధం మాత్రమే మిగిలింది. `అసహన వాగ్యుద్ధా’నికి లోక్ సభ అత్యున్నతవేదిక మారబోతున్నది. రేపటి నుంచి (నవంబర్ 26) నుంచి జరిగే పార్లమెంట్ శీతాకాలపు సమావేశాల్లో కీలకమైన బిల్లుల ఆమోదం సంగతేమోగానీ `అసహనం’ వ్యవహారం మాత్రం అటోఇటో తేలిపోతుంది. ఈ విషయంపై పార్లమెంట్ దద్దరిల్లడం ఖాయం.

ఈ శీతాకాలపు సమావేశాల్లో `అసహనం’పై తీర్మానం ప్రవేశపెట్టాలంటూ ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టబోతున్నాయి. ఈ విషయంపై పార్లమెంట్ దద్దరిల్లబోతున్నదని అంతా భావిస్తుంటే, ప్రధాని నరేంద్రమోదీ మాత్రం సభ అర్థవంతంగా నడుస్తుందనీ, కీలక బిల్లులకు ఆమోదం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అమీర్ ఖాన్ వ్యాఖ్యల కారణంగానే మరోపక్క అఖిలపక్ష సమావేశం కూడా అసహనంపై చర్చను ప్రాధాన్యతా అంశంగానే భావించింది. దేశంలోని ప్రముఖ కళాకారులు, సినీనిర్మాతలు, రచయితలు గతంలో తాము అందుకున్న అవార్డులను తిరిగిఇచ్చేయడం వంటి సంఘటనలను తేలిగ్గాతీసుకోలేమనీ, దానిపై చర్చ అవసరమని ఈ సమావేశం భావించింది. పార్లమెంటరీ వ్యవహారాలశాఖమంత్రి వెంకయ్యనాయుడు కూడా ఇదే సరైన పద్దతిగా అనుకుంటున్నారు. నిజానికి ఈ అంశాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోవే అయినప్పటికీ కేంద్రప్రభుత్వం వీటిపై సమగ్రంగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. దాద్రీలో దాడి, ఎం.ఎం.కల్బుర్గీ మరణం వంటి సంఘటనలు ఎక్కడజరిగినా వాటిని ఖండించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వెంకయ్యనాయుడు అంటున్నారు. దేశ అభివృద్ధి అన్నది శాంతియుత, మతసామరస్యధోరణిలోనే సాధ్యమవుతుందని తమ ప్రభుత్వం భావిస్తున్నదని కూడా వెంకయ్యనాయుడు చెప్పారు. అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ కూడా హాజరయ్యారు.

కాగా, శీతాకాల సమావేశాల్లో ఎన్డీయే ప్రభుత్వం కొన్ని కీలక బిల్లులను ఆమోదింపజేయాలని చూస్తోంది. వస్తు,సేవల పన్ను బిల్లు (GST Bill), భూసేకరణ, రియల్ ఎస్టేట్ నియంత్రణ-అభివృద్ధి వంటి బిల్లలపై ప్రతిపక్షాల సందేహాలను సభలో తీర్చే ప్రయత్నం జరగవచ్చు. అయితే ఎక్కువ సమయం `అసహన’ప్రభంజనంలోనే కొట్టుకుపోయేలా ఉంది. ప్రజాప్రతినిధులు సమన్వయంతో చర్చలు సాగిస్తారా లేక, గందరగోళ పరిస్థితులు సృష్టిస్తారా అన్నది వేచిచూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రైమ్ : ఆ లేడీ పోలీస్ నిత్య పెళ్లి కూతురు..!

పోలీస్‌కు క్రిమినల్ ఆలోచనలు రావాలి. ఎందుకంటే.. క్రిమినల్స్‌ని పట్టుకోవాలి కాబట్టి. కానీ ఆ క్రిమినల్ పనులు చేయాలనుకుంటే మాత్రం మొత్తం పరిస్థితి తేడా వస్తుంది. అసలే పోలీస్.. ఆపై క్రిమినల్ పనులంటే ఇక...

ఒక్క రోజు అసెంబ్లీకి టీడీపీ దూరం..!

తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. బడ్జెట్ ఆమోదించుకోవడం కోసం ఒక్క రోజు సమావేశం పెట్టాలని.. ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఇరవై తేదీన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఒక్క రోజే గవర్నర్...

బడ్జెట్ : గత ఏడాది ఆదాయం కన్నా రూ. లక్ష కోట్ల ఎక్కువ ఖర్చు..!?

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత..? ఈ ప్రశ్న కన్నా ముందు గత ఏడాది ఎంత ఆదాయం వచ్చింది..? ఎంత ఖర్చు పెట్టాం..? ఎంత లోటు ఉంది అన్నది కూడా లెక్కలేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే.....

ఆ సమస్యను చిటికెలో పరిష్కరించిన కేటీఆర్..!

తెలంగాణ మంత్రి కేటీఆర్.. కోవిడ్ టాస్క్ ఫోర్స్‌కు చైర్మన్ అయిన తర్వాత ఎలాంటి సమస్య వచ్చినా చురుగ్గా కదులుతున్నారు. తాజాగా సమ్మెకు వెళ్తామని ప్రకటించిన జూనియర్ డాక్టర్లను ఆయన శాంత పరిచారు. కొద్ది...

HOT NEWS

[X] Close
[X] Close