పార్లమెంట్‌సమావేశాలు ప్రారంభం: బీజేపీపై పార్టీనేత లెటర్ బాంబు

హైదరాబాద్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ఉదయం ప్రారంభమయ్యాయి. ఇటీవలికాలంలో చనిపోయిన పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎంపీలకు నివాళులు, ఇస్రో శాస్త్రవేత్తలకు, పేస్, సానియాలకు అభినందనలు ప్రకటించిన తర్వాత లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. కడియం శ్రీహరి రాజీనామాను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. అటు రాజ్యసభలోమాత్రం లలిత్ మోడి వ్యవహారంపై గందరగోళం చెలరేగింది. రాజస్థాన ముఖ్యమంత్రి వసుంధర రాజేపై విపక్షాలు విమర్శలు గుప్పించారు. లలిత్ మోడి అంశంపై చర్చకు కాంగ్రెస్ సభ్యులు పట్టుపట్టారు. ఐపీఎల్ వ్యవహారంపై చర్చకు సిద్ధమని కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం ప్రకటించారు. సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది.

రెడ్ కార్నర్ నోటీసు జారీ అయిన లలిత్ మోడివంటి వ్యక్తికి విదేశాంగ వ్యవహారాలశాఖమంత్రి సుష్మా స్వరాజ్ సహాయపడటం, మరో కేంద్రమంత్రి స్మృతి ఇరాని విద్యార్హతల వ్యవహారం, వసుంధర రాజే వ్యవహారం, మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంలో జరిగిన వ్యాపం కుంభకోణం తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయటానికి ప్రతిపక్షాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి.  అయితే మంత్రులెవరూ రాజీచేయాల్సిన అవసరంలేదని పార్లమెంటరీ వ్యవహారాలశాఖమంత్రి వెంకయ్య నాయుడు నిన్న అఖిలపక్షసమావేశం ముగిసిన తర్వాత చెప్పారు.

మరోవైపు కేంద్రమంత్రులు, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకవైపు వివిధ వివావాదాలలో ఇరుక్కోవటంలో ఇబ్బంది పడుతున్న అధికారపక్షంపై సొంతపార్టీకే చెందిన ఒక ఎంపీ ఒక లెటర్ బాంబు పేల్చారు. బీజేపీ నేతలపై అవినీతి ఆరోపణలు రావటం పార్టీ ప్రతిష్ఠకు మచ్చలు పడుతున్నాయని, అవినీతిని నిర్మూలించేందుకు పార్టీలో ఒక ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర మాజీ మంత్రి శాంతకుమార్ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాకు ఒక లేఖ రాశారు. ఈ లేఖ రాసి పదిరోజులైనప్పటికీ, ఇవాళ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకాబోతున్న తరుణంలో నిన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలలో బయటపడిన అవినీతికిగానూ సంబంధిత నాయకులపై పేర్లు ప్రస్తావించకుండా ఘాటుగా విమర్శలు చేశారు. శాంతకుమార్ హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రూల్స్ రంజన్.. సూపర్ కాన్ఫిడెన్స్

ఈవారం వస్తున్న ప్రామెసింగ్ సినిమాల్లో కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్' ముందువరుసలో వుంది. కిరణ్ అబ్బవరం పక్కింటి కుర్రాడు ఇమేజ్ తో చేసిన సినిమాలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. రూల్స్ రంజన్ ఆ...

సిద్దార్థ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ !

సిద్ధార్థ్ కి సినిమాలు కలసిరావడం లేదు. ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఏదీ నిలబడటం లేదు,. హిట్టు అనే మాట రావడం లేదు. ఇటివలే టక్కర్ అనే సినిమా చేశాడు. సిద్ధార్థ్ పై...

లోకేష్‌పై అసలు ఎఫ్ఐఆర్లే లేవని చెబుతున్న సీఐడీ

లోకేష్ ను అరెస్టు చేయడం ఖాయమని ఊగిపోయిన సీఐడీ ఇప్పుడు ఆయన పేరు ఇంకా ఎఫ్ఐఆర్‌లో పెట్టలేదని చెబుతోంది. ఐఆర్ఆర్ కేసులో ఏ 14గా చేర్చి.. అరెస్ట్ చేస్తామన్నట్లుగా ఢిల్లీ వెళ్లి .....

హిందీలో మార్కులు కొట్టేసిన రవితేజ

రవితేజ చక్కని హిందీ మాట్లడతారు. ఆయన నార్త్ లో కొన్నాళ్ళు వుండటం వలన హిందీ అలవాటైయింది. ఇప్పుడీ భాష 'టైగర్ నాగేశ్వరరావు' కోసం పనికొచ్చింది. రవితేజ కెరీర్ లో చేస్తున్న మొదటి పాన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close