అమరావతిని బాహుబలితో పోల్చిన రోజా

హైదరాబాద్: సింగపూర్ మంత్రి ఈశ్వరన్ నేతృత్వంలోని బృందం ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి నిర్మాణంపై నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సమర్పించిన మాస్టర్ ప్లాన్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు, ఎమ్మెల్యే రోజా ఇటీవల విడుదలైన బాహుబలి చిత్రంతో పోల్చారు. గ్రాఫిక్స్‌తో రూపొందించిన్ మాస్టర్ ప్లాన్‌ వీడియోద్వారా తొక్కిసలాట ఘటనను, ఓటుకు నోటు కేసును ప్రజలు మరచిపోయేలా చేయటానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.  బాహుబలిలాగా అమరావతి సినిమాను చూపించి ప్రజలను మోసగించాలని సీఎమ్ ప్రయత్నిస్తున్నారని రోజా అన్నారు. ఈ సినిమాచూసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో, ఓ సామాజికవర్గమో సంతోషించినా ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదని చెప్పారు. రాజధాని ప్రణాళికలో సామాన్యులకు, మధ్యతరగతివారికి చోటెక్కడ అని ప్రశ్నించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close