చైతన్య : విభజన బిల్లు తర్వాత పార్లమెంట్ సాక్షిగా మరోసారి ప్రజాస్వామ్య పతనం..!

ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును పార్లమెంట్ ముఖ్యంగా రాజ్యసభ ఆమోదించిన విధానం భారత ప్రజాస్వామ్య పునాదుల్ని బలహీనం చేసింది. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి.. తలుపులు మూసేసి.. లోపలేం జరిగిందో రికార్డులు తెలియకుండా.. ఎవరు మద్దతిచ్చారో..ఎవరు వ్యతిరేకించారో కూడా .. చరిత్రకు తెలియకుండా చేసి. మూజువాణి ఓటుతో ఆమోదింప చేసుకున్నారు. ఈ ప్రజాస్వామ్య పతన ప్రయత్నంలో అన్ని పార్టీలు భాగస్వాములయ్యాయి. ఇప్పుడు అదే ఒరవడి కొనసాగుతోంది. రోజు రోజుకు ప్రజాస్వామ్య పునాది బలహీనపడిపోతోంది. వ్యవసాయ బిల్లును కేంద్రం మరోసారి అదే పద్దతిలో ఆమోదింప చేసేసుకుంది.

స్పీకర్ లేదా చైర్మన్ స్థానంలో ఉన్న వారిదే నిర్ణయం..!

సభలో ప్రభుత్వం నిలబడాలన్నా.. బిల్లులు పాసవ్వాలన్నా ఇక మెజార్టీ ఉండాల్సిన అవసరం లేదని.. వరుసగా జరుగుతున్న పరిణామాలతో నిరూపితమవుతోంది. మూజువాణి ఓటు అనే మార్గం ద్వారా అన్నింటికీ ఓకే చేసుకుంటూ.. వెళ్లిపోయే దగ్గరి దారిని ప్రభుత్వాలు కనిపెట్టేశాయి. ఇలా చేయాలంటే స్పీకర్ స్థానంలో తమ వారు ఉంటే సరిపోతుంది. వారు విలువల్ని పాటిస్తారా..? ప్రజాస్వామ్యం గురించి అవగాహన ఉందా..? రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా..? వంటి వాటి గురించి పట్టింపు లేదు. ఒక వేళ.. స్పీకర్ లేదా చైర్మన్‌కు ఇబ్బంది అయితే.. వారు ఆ సమయానికి పక్కకు వెళ్లిపోతే.. ప్యానల్ స్పీకర్‌నో మరొకర్నో తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి పని పూర్తి చేసే వెసులుబాటు కూడా ఉంది. ఈ విషయం రాజ్యసభలో మరోమారు వ్యవసాయ బిల్లు విషయంలో స్పష్టమయింది. రాజ్యసభలో మెజార్టీ లేదని తెలిసి.. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదింపచేసేసుకున్నారు. దీంతో విభజన బిల్లు తర్వాత .. భారత ప్రజాస్వామ్యం పతనం దిశగా మరో అడుగు ముందుకు వేసినట్లయింది.

సముగ్రమైన చర్చ జరిగితే ప్రజాస్వామ్యానికి నష్టమా..?

వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. రైతుల్లో అనేక అంశాలపై అపోహలు ఏర్పడ్డాయి. తాము కార్పొరేట్ల చేతిలో పావుగా మారబోతున్నామని రైతులకు అర్థయింది. కానీ అలా కాదని ప్రభుత్వం అంటోంది. నిజానికి ఆలాంటిదేమీ లేనప్పుడు ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా రైతులకు బిల్లుల వల్ల కలిగే ప్రయోజలను వెల్లడిచాల్సింది ప్రతిపక్షాలను కన్వీన్స్ చేయాల్సింది. ప్రభుత్వం తీసుకొచ్చిన అనేకానేక బిల్లులను.. ఓటింగ్ ద్వారానే ఆమోదం పొందారు. అలాంటప్పుడు.. అత్యంత వివాదాస్పదమైన బిల్లుకూ ఆదే దారిని పాటించాల్సి ఉంది. అలా చేసి ఉంటే… ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అనుకున్నా.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే చేసిందని .. ప్రజాస్వామ్యమేనని.. సర్దుకుపోయే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు… ఆ బిల్లులపై అనుమానాలు అలాగే ఉన్నాయి.. ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో.. మరింత బలపడే ప్రమాదం కూడా ఉంది.

అధికార బలంతో ఏదైనా చేస్తే అంతిమంగా నష్టం దేశానికే..!

ఒకప్పుడు.. పార్లమెంట్‌లో గీత దాటడాన్ని కూడా.. సభ్యులు అవమానంగా ఫీలయ్యేవారు. అర్థవంతమైన చర్చలు జరిగేవి. ఆ చర్చల ద్వారానే.. ఆ బిల్లు ఎలాంటిదో ప్రజలు నిర్ణయించుకునేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. చర్చల సంగతి తర్వాత అసలు ఆ బిల్లుకు మద్దతు లేకపోయినా… ఓ వైపు ప్రజాందోళనలు భారీ స్థాయిలో జరుగుతున్నా.. అంతా రాజకీయం అనే ముద్ర వేసి తమ పని తాము చేసుకుపోతున్నారు పాలకులు. ఈ క్రమంలో పార్లమెంట్ ను కూడా.. అధికార బలంతోనే దారిలో తెచ్చుకుంటున్నారు. ఈ పరిణామాలు దేశాన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. ఇప్పుడు బిల్లులే .. రేపు ప్రభుత్వాలు కూడా ఇదే పద్దతిలో కొనసాగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే.. పతనం ప్రారంభమైన తర్వాత.. ఎక్కడ ఆగుతుందో అంచనా వేయడం కష్టం. ఆ విషయం.. ఏపీ లాంటి కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలే నిరూపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close