ఎక్కడ..? నాడు “పింక్ డైమండ్” రచ్చ చేసిన మీడియా విశ్లేషకులెక్కడ..!?

అప్పుడెవరో ఓ పెద్ద మనిషి… శ్రీవారికి ఓ పింక్ డైమండ్ ఉండేదని.. ఇప్పుడు కనిపించడం లేదని.. ఓ ప్రకటన చేశారు. అంతే.. మీడియా విశ్లేషకులకు పూనకం వచ్చేసింది. చర్చోపచర్చలు పెట్టారు. పింక్ డైమండ్ ఎలా ఉండేదో.. గ్రాఫిక్స్ వేశారు. ఎలా పోయి ఉంటుందో క్రైమ్ కథలు అల్లారు. దానికి రాజకీయ నాయకుల ప్రకటనలు. .. అప్పటి ముఖ్యమంత్రి ఇంట్లో తవ్వాలని ఒకరు.. స్విట్జర్లాండ్‌లోని “సౌతీబీ” ఆక్షన్ కేంద్రంలో ఉందని మరొకరు.. ఇలా ప్రపంచం మొత్తాన్ని చుట్టేసేలా.. కుట్ర కథలు అల్లేశారు. ఓ రెండు నెలల పాటు ఈ రచ్చ సాగింది. వాళ్ల టార్గెట్ నెరవేరింది. అంటే… పింక్ డైమండ్‌ను కనిపెట్టడం కాదు..ఇంకేదో.. !

హిందూత్వ బ్రాండ్ విశ్లేషకులకు ప్రస్తుత పరిస్థితులు కనిపించడం లేదా..?

ఇప్పుడు ప్రభుత్వం మారింది.. మారగానే పింక్ డైమండ్ అనేదే లేదని.. ప్రభుత్వమే కొత్తగా నియమించిన అధికారులు తేల్చేశారు. అప్పుడు.. ఆ పింక్ డైమండ్ గురించి మాట్లాడిన పెద్ద మనిషి నోరెత్తలేదు… వాటిపై చర్చా కార్యక్రమాలు పెట్టి.. రెండు నెలల పాటు హడావుడి చేసిన వారు.. అప్పటి సీఎం ఇళ్లను తవ్వాలన్న వారు సైలెంటయిపోయారు. ఇప్పుడు అంత కన్నా ఎక్కువ రచ్చ జరుగుతోంది. హిందూత్వంపైనే నేరుగా దాడి జరుగుతోంది. సాక్షాత్తూ తిరుమల పవిత్రతనే తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక్కరంటే.. ఒక్క మీడియా విశ్లేషకుడికి నోరు పెగలడం లేదు. ఎందుకిలా చేస్తున్నారని ప్రభుత్వాన్ని అడగడానికి ధైర్యం సరిపోవడం లేదు.

పింక్ డైమండ్‌ మీద ఉన్నంత ఆసక్తి శ్రీవారి సంప్రదాయాల ఉల్లంఘనపై ఉండదా..!?

లేని పింక్ డైమండ్ మీద ప్రజల్లో అనుమానాలు కలిగేలా చేసిన ఆ లబ్ద ప్రతిష్టులైన మీడియా విశ్లేషకులు.. నేడు నేరుగా.. శ్రీవారి పవిత్రతనే గురి పెట్టినా స్పందించడంలేదు. అంత ఎందుకు.. ఆ పింక్ డైమండ్ గురించి చెప్పి.. అసలు వివాదం రేపిన పెద్ద మనిషి.. జీవితాంతం.. శ్రీవారి సేవలో గడిపిన వ్యక్తి కూడా.. నోరు మెదపడం లేదు. అన్యమతస్థులు శ్రీవారిని దర్శించుకుంటే డిక్లరేషన్ ఇవ్వాలనేది చట్టంలో ఉన్న అంశం. దానికి తిరుగులేదు. సీఎంలకు.. పీఎంలకు.. రాష్ట్రపతి లాంటి వారికి మినహాయింపు ఇవ్వాలని చట్టం లేదు. ఇదంతా అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. కానీ మీడియా విశ్లేషకులుకు ప్రశ్నించడం లేదు. ప్రశ్నిస్తే..తమపై ఎక్కడ కేసులు పెడతారనో.. లేకపోతే.., ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రయోజనాలకు ఎక్కడ పులిస్టాప్ పడుతుందనో భయపడుతున్నారు.

పప్పుబెల్లాలు ఇచ్చే వారి కోసం శ్రీవారి పవిత్రతను దెబ్బతీస్తున్నా మాట్లాడరా..?

పింక్ డైమండ్ పేరుతో అప్పట్లో దేవుడితో రాజకీయం చేశారు. ఇప్పుడు… కూడా అదే రాజకీయం చేస్తున్నారు. ఏ దేవుడ్ని వాడుకుని రాజకీయం చేశారో.. ఆ దేవుడి పవిత్రతను దెబ్బతీయడానికి ఘోరమైన ప్రయత్నాలు చేస్తున్నా.. నాడు సహకకరించిన సోకాల్డ్ హిందూత్వ ఉద్దారక మీడియా విశ్లేషకులు ఇప్పుడు ప్రభుత్వం అందించిన ప్రసాదాన్ని నోట్లో పెట్టుకుని సైలెంట్‌గా కూర్చున్నారు. శ్రీవారి ఆలయం సాక్షిగా హిందూత్వంపై జరుగుతున్న భయంకరమైన దాడి సామాన్య భ క్తులను సైతం ఆవేదనకు గురి చేస్తున్నా… ఒక్కరంటే.. ఒక్కరూ నోరు మెదపడం లేదు.

పరమత సహనాన్ని దెబ్బ తీస్తున్నా మాట్లాడాలని అనిపించడం లేదా..?

ఓ మంత్రి విగ్రహం కూలగొట్టేస్తే నష్టమేంటి.. మళ్లీ కట్టుకోవచ్చంటాడు.. ! రథం తగలబడితే పోయేదేమిటంటాడు..! ఇంకొకరు.. చర్చిలపై రాళ్లేస్తారా అని ఆవేశ పడతారు… ! ఏపీలో ఎందుకిలా జరుగుతోంది…? పరతమ సహనం.. అనేది ఏపీ ప్రజలకు మొదటి నుంచి అలవాటు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కలసిమెలిసి ఉండేవారు. ఇప్పుడు విభజన ఎందుకు తెస్తున్నారు..? ఎ రాజకీయం కోసం తెస్తున్నారు..? వీటన్నింటి వెనుక ఉన్న కుట్రలను బయట పెట్టే శక్తి.. కుట్రల్లో భాగమైన మీడియా విశ్లేషకులకు లేకుండా పోయిందా..? సమాజం ఏమైపోయినా పర్వాలేదు.. తమ తాయిలాలు తమకు వస్తే చాలనుకుంటున్నారా..? రేపు ఇదే సోకాల్డ్ మీడియా విశ్లేషకులు… నాస్తికత్వం పేరుతో కొత్త తరహా చర్చా కార్యక్రమాలతో మరో రకమైన దాడిని .. ప్రజల మనోభావాలపై చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే.. వారి ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కళ్ల ముందు కనిపిస్తున్న ఇళ్లతో టీడీపీ రాజకీయం..!

పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తామంటూ హడావుడి చేసిన వైసీపీ సర్కార్... ఏడాదిన్నర గడిచిపోయినా ఆ దిశగా కనీసం అడుగులు వేయలేకపోయింది. ఆ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న అభిప్రాయం...

క్రైమ్ : అత్త – అల్లుడు – వివాహేతర బంధం- హత్య..

సమాజంలో చిత్రమైన నేరాలు అప్పుడప్పుడూ వెలుగుచూస్తూ ఉంటాయి. అలాంటిది హైదరాబాద్‌లో ఒకటి బయటపడింది. ఓ నడి వయసు మహిళ.. ఓ యువకిడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తాను పెళ్లి చేసుకోలేదు కనుక.. కూతుర్ని...

యుద్ధం మొద‌ల‌వ్వ‌క‌ముందే.. తెల్ల‌జెండా ఊపేసిన ర‌జ‌నీ!

క‌రోనా ఎంత ప‌ని చేసిందో? క‌రోనా వ‌ల్ల సినిమా షూటింగులు ఆగిపోయాయి. సినిమా విడుద‌ల‌లూ ఆగిపోయాయి. ఆఖ‌రికి... ఓ సూప‌ర్ స్టార్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికీ బ్రేకులు ప‌డ్డాయి. ఆ స్టార్...

పెళ్లి సంద‌డి ‘క్లాసులు’ షురూ!

రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న చిత్రం `పెళ్లి సంద‌డి`. ఆనాటి పెళ్లి సంద‌డిలో శ్రీ‌కాంత్ హీరో అయిన‌ట్టే, ఇప్ప‌టి పెళ్లి సంద‌డిలో శ్రీ‌కాంత్ త‌న‌యుడ్ని హీరోగా ఎంచుకున్నారు. శ్రీ‌కాంత్ వార‌సుడు రోష‌న్‌కి ఇప్ప‌టికే...

HOT NEWS

[X] Close
[X] Close