మ‌హేష్ సంగ‌తి తేల్చేసిన ప‌రిణీతి చోప్రా

మ‌హేష్ బాబు – మురుగ‌దాస్ సినిమాలో ప‌రిణీతి చోప్రా క‌థానాయిక‌గా న‌టిస్తోంద‌ని, అందుకోసం ఏకంగా మూడున్న‌ర కోట్ల పారితోషికం డిమాండ్ చేసింద‌న్న వార్త‌లు గుప్పుమ‌న్నాయి. బాలీవుడ్‌లో ప‌రిణీతి చోప్రా ఓ రేంజు హీరోయిన్ కాబ‌ట్టి.. ఆ మాత్రం ఇవ్వ‌డంలో త‌ప్పు లేద‌నుకొన్నారు. మ‌రి ఇంత‌లో ఏమైందో, ఏమో.. ఈ ప్రాజెక్టు నుంచి ప‌రిణీతి చోప్రా డ్రాప్ అవ్వ‌డం.. ఆ ప్లేసులో ర‌కుల్ వచ్చి చేర‌డం జ‌రిగిపోయాయి. పారితోషికం విష‌యంలో పేచీ వ‌చ్చే ప‌రిణీతి ఈ సినిమా నుంచి డ్రాప్ అయ్యింద‌న్న గుస‌గుస‌లు వినిపించాయి. ఈ విష‌యంపై ఎట్ట‌కేల‌కు ప‌రిణీతి స్పందించింది. ఈ రూమ‌ర్ల‌పై ఓ క్లారిటీ ఇచ్చింది.

”మురుగ‌దాస్ న‌న్ను సంప్ర‌దించిన మాట వాస్త‌వ‌మే. అయితే.. నేను ఈ సినిమా చేస్తాన‌ని అన‌లేదు. సంత‌కాలూ చేయ‌లేదు. అలాంట‌ప్పుడు పారితోషికం గురించి ప్ర‌స్తావ‌న ఎందుకొస్తుంది? సౌత్‌లో ఓ సినిమా చేయాల‌ని నాకూ ఉంది. కానీ.. కుద‌ర‌డం లేదు. నాకున్న బిజీ షెడ్యూల్స్ వ‌ల్ల అది సాధ్యం కావ‌డం లేదు. అంతేత‌ప్ప‌.. పారితోషికం కోసం సినిమాల్ని వ‌దులుకోలేదు.. ఆ మాట త‌ప్పు” అంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com