పవన్ అభిమానులకు నచ్చే సబ్జెక్ట్ చెప్పిన హరీష్ శంకర్

ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్‌లో ఎక్కువ‌గా రీమేక్ క‌థ‌లే క‌నిపిస్తాయి. అవ‌న్నీ మంచి విజ‌యాల్ని అందించాయి కూడా. ఇప్పుడు కూడా ప‌వ‌న్ అరువు క‌థ‌ల‌పైనే ఆధార‌ప‌డుతున్నాడు. పొలిటిక‌ల్ ఎంట్రీ త‌ర‌వాత‌.. చేస్తున్న సినిమా `వ‌కీల్ సాబ్‌` రీమేక్ క‌థే.  సితార బ్యాన‌ర్‌లో, సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా.. మ‌ల‌యాళ  `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` కి రీమేక్‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ – హ‌రీష్ శంక‌ర్ కాంబోలో ఓ సినిమా రూపొంద‌నుంది. మైత్రీ మూవీస్ తెర‌కెక్కిస్తోంది. ఇది కూడా రీమేకే అని గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రిగింది.

అయితే… ప‌వ‌న్ కోసం స్ట్ర‌యిట్ క‌థ‌నే త‌యారు చేసుకున్నాడు హ‌రీష్‌. ఇటీవ‌లే ఆ క‌థ‌ని ప‌వ‌న్‌కి వినిపించ‌డం, ప‌వ‌న్ ప‌చ్చ‌జెండా ఊపేయ‌డం జ‌రిగిపోయాయి. ఈ క‌థ‌, దానికి హ‌రీష్ ఇచ్చిన ట్రీట్‌మెంట్‌, క్యారెక్ట‌రైజేష‌న్‌.. ఇవ‌న్నీ ప‌వ‌న్‌కి బాగా న‌చ్చాయ‌ట‌. క‌థ విష‌యంలో.. సినిమాల్ని ఒప్పుకొనే విష‌యంలో ప‌వ‌న్ చాలా స‌మ‌యం తీసుకుంటాడు. త‌న‌వైన మార్పులూ, చేర్పులూ జోడించి న‌గిషీలు దిద్దుతూ ఉంటాడు. ప‌వ‌న్‌కి ఏ క‌థా ఓ ప‌ట్టాన న‌చ్చ‌ద‌ని చెబుతుంటారు. అయితే.. హ‌రీష్ మాత్రం సింగిల్ సిట్టింగ్ లోనే ఈ క‌థ‌ని ఓకే చేయించుకున్నాడు. దాన్ని బ‌ట్టి.. ప‌వ‌న్‌కి ఈ క‌థ ఎంత న‌చ్చిందో అర్థం చేసుకోవొచ్చు,
గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర‌వాత‌.. ప‌వ‌న్ పూర్తిస్థాయి క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయ‌లేదు. త‌న‌దైన హుషారు.. త‌న పాత్ర‌లో చూపించ‌లేదు. ఈసారి  మాత్రం హ‌రీష్ శంక‌ర్… గ‌బ్బ‌ర్ సింగ్ లా ఎన‌ర్జిటిక్ పాత్ర‌నే సృష్టించాడ‌ని టాక్‌. ఈ క్యారెక్ట‌రైజేష‌న్ గురించి కూడా కొన్నాళ్లు చెప్పుకునేలా ఆ పాత్ర‌ని మ‌లిచాడ‌ట‌. మొత్తానికి హ‌రీష్ వ‌ల్ల‌… రీమేక్‌ల  ప‌రంప‌ర‌కు ప‌వ‌న్ కాస్త బ్రేక్ ఇచ్చిన‌ట్టైంది. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీతో సంబంధం లేకుండానే పవన్ రైతు టూర్..!

నివార్ తుపాన్ విషయంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అంశం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దుమారానికి కారణం అవుతోంది. ప్రభుత్వం ఎలాంటి సాయం ప్రకటించకపోవడం... రైతుల్లో ఆందోళన పెరిగిపోతూండటంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి....

చంద్రబాబుపై ఏం చర్యలు తీసుకోబోతున్నారు..!?

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అనర్హతా వేటు వేస్తారా..?. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తర్వాత అసెంబ్లీలో జరిగిన పరిణామాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఆయనపై అనర్హతా వేటు...

కోహ్లీ… ఇదేం కెప్టెన్సీ??

ప్ర‌పంచ అత్యుత్త‌మ బ్యాట్స్‌మెన్‌ల‌లో కోహ్లీ ఒక‌డు. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి సందేహాలూ లేవు. క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డుల‌న్నీ బ‌ద్దలు కొట్ట‌గ‌ల సామ‌ర్థ్యం త‌న‌కు మాత్ర‌మే ఉంద‌న్న‌ది క్రికెట్ అభిమానుల...

రైతులకు పరిహారంపై జగన్ ఔదార్యం చూపలేకపోతున్నారా..!?

నివార్ తుపాన్ కారణంగా పెద్ద ఎత్తున నష్టపోయిన రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి భారీ నష్టపరిహారం ప్రకటిస్తారని ఆశ పడిన వారికి నిరాశే ఎదురయింది. ఎకరానికి పంటను బట్టి పదిహేను నుంచి పాతిక వేల...

HOT NEWS

[X] Close
[X] Close