నరేష్, పవిత్ర లోకేష్ కలసి మళ్ళీ పెళ్లి సినిమా చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఇది వాళ్ళ బయోపిక్ అన్నట్లుగా వుంది. నరేష్, పవిత్ర అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ఒకరినొకరు ఇష్టపడి కలసి బ్రతుకుతున్నారు. అయితే వారి బంధంపై నరేష్ భార్య రమ్యరఘుపతి తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక హోటల్ రూమ్ లోకి మీడియాని తీసుకెళ్ళడం రాద్దాంతానికి దారి తీసింది. అవన్నీ ఇప్పుడు మళ్ళీ పెళ్లి ట్రైలర్ కనిపించాయి. తాజాగా పవిత్రా లోకేష్.. ఈ విషయాలన్నీటిపై స్పందించారు.
‘’నరేశ్ గారు నేను ఒకరిని ఒకరకం ఇష్టపడి కలసి బ్రతుకుతున్నాం. మేము ఎప్పుడూ వీధిలో పడాలని అనుకోలేదు. కానీ కొందరు నా వ్యక్తిత్వ హననం చేసి బయట పడేశారు. అయితే అలాంటి పరిస్థితి నుంచి ఎంత హుందాగా బయటకి వస్తామనేది ముఖ్యం. నేను ఎదురుకొన్న పరిస్థితిలో రెండు ఆప్షన్స్ వుంటాయి. ఒకటి ఆత్మహత్య చేసుకోవాలి. లేదా ఎవరికీ కనిపించకుండా ఇంట్లో కూర్చోవాలి. కానీ నరేష్ గారు నా వెంట నిలిచారు. ధైర్యం ఇచ్చారు. నేను గానీ నరేష్ గారు కానీ ఎప్పుడూ ఒకరికి హాని చేయాలని అనుకోం. మా ఇష్టప్రకారం బ్రతుకుతున్నాం. మాకు కుటుంబం అంగీకారం వుంది’’ అని చెప్పుకొచ్చారు పవిత్ర.