రైటర్ పద్మభూషణ్ తర్వాత చాయ్ బిస్కెట్ నుంచి వస్తున్న సినిమా మేమ్ ఫేమస్. అంతా కొత్తవాళ్ళతో తీసిన ఈ సినిమా మంచి ప్రచార ఎత్తుగడలతో అందరి నోట్లు నానుతోంది. సుమంత్ ప్రభాస్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాకి దర్శకత్వం వహించడంతో పాటు నటించాడు. అంతకుముందు ఒక వెబ్ సిరిస్, షార్ట్ ఫిల్మ్ తీసిన అనుభవం వుంది .
అయితే తన మొదటి సినిమా కోసం చాలా వినూత్న ప్రయత్నమే చేశాడు సుమంత్. ఈ సినిమా మొత్తాన్ని ఆఫీస్ లో సెల్ ఫోన్ తో షూట్ చేశాడు. లొకేషన్ తో సంబంధం లేకుండా మొదట అన్నీ సీన్లని ఆఫీస్ లోనే తీసేశాడు. తర్వాత లోకేషన్స్ లో షూట్ చేశాడు. దీంతో లొకేషన్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చకచక షూటింగ్ సాగిపోయిందని చెబుతున్నాడు.
కొత్త దర్శకుడికి ఒక సినిమా ఇచ్చే ముందే ఒకటి రెండు సీన్లు షూట్ చేసుకొని రమ్మని చెబుతారు. కానీ సుమంత్ మాత్రం మొత్తం సినిమాని సెల్ ఫోన్ లో షూట్ చేసుకొని వెళ్ళాడు. బహుసా టాలీవుడ్ ఇలా చేయడం ఇదే తొలిసారేమో.