‘ఓజీ’లో ప‌వ‌న్ పాట‌?!

ప‌వ‌న్ క‌ల్యాణ్ లో న‌టనే కాదు. చాలా కోణాలున్నాయి. సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల్లోనూ ప‌వ‌న్‌కు ప‌ట్టుంది. త‌న‌లో క‌థ‌కుడు, దర్శ‌కుడు, కొరియోగ్రాఫ‌ర్ అంద‌రూ ఉన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా… గాయ‌కుడు కూడా. త‌న సినిమాల కోసం అప్పుడ‌ప్పుడూ ప‌వ‌న్ గొంతు స‌వ‌రించుకొంటుంటాడు. జాన‌ప‌ద శైలిలో సాగే పాట‌లంటే త‌న‌కు మ‌రింత ఇష్టం. ప‌వ‌న్ పాట‌ల‌న్నీ దాదాపుగా పాపుల‌ర్ అయిన‌వే. ఇప్పుడు ‘ఓజీ’ కోసం ప‌వ‌న్ మ‌రోసారి గొంతు స‌వ‌రించుకొంటున్న‌ట్టు టాక్.

సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా రూపొందుతున్న చిత్రం ‘ఓజీ’. ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ప‌వ‌న్ సినిమాల‌కు త‌మ‌న్ సంగీతం అందించ‌డం కొత్తేం కాదు. కాక‌పోతే ప‌వ‌న్‌తో పాటేం పాడించ‌లేదు. ఆలోటు.. ‘ఓజీ’తో తీర‌బోతోంద‌ని తెలుస్తోంది. ‘ఓజీ’లో ప‌వ‌న్ పాడ‌ద‌గ్గ పాట‌, అలాంటి సంద‌ర్భం కుదిరాయ‌ని, ప‌వ‌న్ కూడా ఈ పాట పాడ‌డానికి సిద్ధంగా ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ‘ఓజీ’పై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ సినిమా గ్లింప్స్ అభిమానుల‌కు కొత్త ఉత్సాహాన్ని అందించింది. ఆ గ్లింప్స్‌కి త‌మ‌న్ అందించిన నేప‌థ్య సంగీతం మ‌రింత ప్ల‌స్ పాయింట్ గా మారింది. ఇప్పుడు ప‌వ‌న్ పాట కూడా పాడేస్తే ‘ఓజీ’కి మరింత నిండుద‌నం స‌మ‌కూర‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘స‌రిపోదా శ‌నివారం’ గ్లింప్స్‌: క్ర‌మ‌బ‌ద్ధ‌మైన కోపం

https://www.youtube.com/watch?v=jS0_9pfvixo&list=PLgCNTKEOcOc6ktQjMOqJQ68e0UlEb2bJD&index=2 ఎప్పుడూ కొత్త త‌ర‌హా క‌థ‌లు, వెరైటీ క్యారెక్ట‌రైజేష‌న్స్ తో క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఉన్న ప్ర‌యోగాలు చేస్తుంటాడు నాని. త‌న కొత్త సినిమా 'స‌రిపోదా శ‌నివారం' కూడా అలాంటి ప్ర‌య‌త్న‌మే. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం...

సిద్దార్థ్ రాయ్ రివ్యూ: లాజిక్స్‌ Vs ఎమోష‌న్స్

Siddharth Roy Movie Telugu Review తెలుగు360 రేటింగ్‌: 2.5/5 -అన్వ‌ర్‌ ఏ సినిమాకైనా విడుద‌ల‌కు ముందు బ‌జ్ సంపాదించ‌డం అవ‌స‌రం. చిన్న సినిమాల‌కు అది అత్య‌వ‌స‌రం. అలా.... విడుద‌ల‌కు ముందే 'ఇందులో ఏదో ఉంది' అనే...

రఘురామ రాజీనామా – జగన్ అహన్ని నాలుగేళ్లు కసితీరా కొట్టిన ఎంపీ

వైసీపీకి ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా చేశారు. తనపై అనర్హతావేటు వేయించేందుకు జగన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని రాజీనామా లేఖలో వెటకారం చేశారు. మీడియాలో జగన్ రెడ్డిని ఎంత కామెడీ...

పోలీసుల సమస్యలు పరిష్కరించాలని జగన్ రెడ్డికి డీజీపీ లేఖ !

అదేంటో ... ఐదేళ్ల వరకూ తమ పోలీసు సిబ్బందికి సమస్యలు ఉన్నాయని.. వారి టీఏ, డీఏలు కత్తిరించినప్పుడు కూడా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి గుర్తు రాలేదు., ఇప్పుడు ఎన్నికలకు ముందు.. .మరో పది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close