‘హ‌నుమాన్ 2’… పెద్ద ప్లానింగే!

చిన్న సినిమా స‌త్తా మ‌రోసారి ‘హ‌నుమాన్‌’తో తెలిసొచ్చింది. కంటెంట్ ఉంటే – స్టార్లు అవ‌స‌రం లేద‌ని ‘హ‌నుమాన్‌’ నిరూపించింది. ‘హ‌నుమాన్‌’ పార్ట్ 2 ఉంద‌ని ముందు నుంచీ చిత్ర‌బృందం చెబుతూనే ఉంది. దానికి త‌గ్గ‌ట్టుగానే క్లైమాక్స్ డిజైన్ చేశారు. క్లైమాక్స్‌లోని హ‌నుమంతుడి షాట్స్‌.. గూజ్‌బ‌మ్స్ తెప్పించాయి. సెకండ్ పార్ట్ వేరే లెవల్‌లో ఉంటుంద‌న్న భ‌రోసా క‌ల్పించింది. ‘హ‌నుమాన్’ క‌నీవినీ ఎరుగ‌ని స్థాయిలో విజ‌యం సాధించిన నేప‌థ్యంలో పార్ట్ 2పై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. దానికి త‌గ్గ‌ట్టుగానే ‘హ‌నుమాన్ 2’ కంటెంట్ ని ప్ర‌శాంత్ వ‌ర్మ సిద్ధం చేశాడ‌ట‌.

‘హ‌నుమాన్‌’లో స్టార్లెవ‌రూ లేరు. హ‌నుమంతుడే పెద్ద స్టార్‌. కాక‌పోతే ఆ పాత్ర‌ని గ్రాఫిక్స్‌లో డిజైన్ చేశారు. కానీ పార్ట్ 2లో ఆ పాత్ర‌ని పూర్తి స్థాయిలో చూపించాలి. అందుకోసం ఓ స్టార్ హీరో కావాలి. హ‌నుమంతుడి పాత్ర కోసం ఓ పెద్ద హీరోని రంగంలోకి దించాల‌న్న‌ది ప్ర‌శాంత్ వ‌ర్మ ప్లాన్‌. అది అతిథి పాత్రే.. కానీ క‌థ‌కు కీల‌కం. హ‌నుమాన్ భారీ విజ‌యం సాధించిన నేప‌థ్యంలో ఆ పాత్ర కోసం ఎవ‌రిని సంప్ర‌దించినా ‘నో’ అని చెప్పే అవ‌కాశం లేదు. ‘హ‌నుమాన్‌’లో విల‌న్ పాత్ర కాస్త బ‌ల‌హీనంగా ఉంద‌న్న మాట వినిపించింది. పార్ట్ 2లో ఆ తీర‌బోతోంద‌ని తెలుస్తోంది. విల‌న్ పాత్ర కోసం కూడా ఓ హీరోని ఎంచుకోవాల‌ని ప్ర‌శాంత్ వ‌ర్మ భావిస్తున్నాడ‌ట‌. ‘హనుమాన్‌’ అంతా అంజ‌నాద్రి అనే క‌ల్పిత ప్రాంతంలో జ‌రిగిన క‌థ‌. కేవ‌లం ఓ ఊరికే ప‌రిమిత‌మైంది. ఈసారి స్పాన్ పెర‌గ‌బోతోంది. హ‌నుమాన్ లో వేల‌మందితో ఓ యుద్ధం జ‌ర‌గ‌బోతున్న‌ట్టు కొన్ని షాట్స్ లో చూపించారు. ఆ సీక్వెన్స్‌… ‘హ‌నుమాన్ 2’ లో ఉండ‌బోతోంది. వార్ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు హాలీవుడ్ సినిమాని త‌ల‌ద‌న్నేలా తీర్చిదిద్దాల‌నుకొంటున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌,. హ‌నుమాన్ కేవ‌లం రూ.27 కోట్ల‌తో పూర్త‌య్యింది. పార్ట్ 2కి అంత‌కు రెండింత‌లు బ‌డ్జెట్ కేటాయించ‌డానికి నిర్మాత సిద్ధంగా ఉన్నాడు. కాబ‌ట్టి.. హ‌నుమాన్ 2కి బ‌డ్జెట్ స‌మ‌స్య‌లు కూడా లేన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘భీమా’ ట్రైలర్ టాక్ : బ్రహ్మ రాక్షసుడు

https://www.youtube.com/watch?v=P3t--CmbibE మార్చిలో వస్తున్న సినిమాల్లో గోపీచంద్‌ 'భీమా' ఒకటి. కన్నడ దర్శకుడు ఎ.హర్ష దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ బయటికి వచ్చింది. ట్రైలర్ అంతా యాక్షన్, ఎలివేషన్స్ తో నిండిపోయింది. ట్రైలర్ లో...

జనసేనను రెచ్చగొట్టే ప్లాన్ ఫెయిలయిందని వైసీపీ గగ్గోలు !

టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదరకూడదని.. పొత్తు కుదిరినా రెండు పార్టీల సీట్ల పంచాయతీ పెట్టాలని చాలా కాలంగా వైసీపీ వ్యూహకర్తలు చేస్తున్న ప్రయత్నాలన్నీ తేలిపోయాయి. సీట్ల సర్దుబాటు .. అభ్యర్థుల ప్రకటన...

ఇలాగైతే ర‌ధ‌న్‌కి క‌ష్ట‌మే!

టాలీవుడ్ లో ప్ర‌తిభావంతులైన సంగీత ద‌ర్శ‌కుల‌కు కొద‌వ లేదు. కీర‌వాణి, త‌మ‌న్‌, దేవిశ్రీ‌ల‌తో పాటు భీమ్స్, మిక్కీ జే మేయ‌ర్ లాంటివాళ్లు అందుబాటులో ఉన్నారు. ర‌ధ‌న్ పేరు కూడా బాగా పాపుల‌ర్‌. చిన్న‌,...

ఫస్ట్ లిస్ట్ : టీడీపీ – జనసేన యుద్ధానికి సిద్ధం !

సిద్ధం సిద్ధం అని జగన్ రెడ్డి అరుస్తూనే ఉన్నారు. జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తున్నారు. ఒక జాబితాలో ఉన్న వారి పేరు మరో జాబితాలో మార్చేస్తున్నారు. ఒక్క ఎంపీ అభ్యర్థి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close