ప‌వ‌న్‌… ఫ్యాన్స్ ఫీలౌతున్నారు

అనుపమ చోప్రాకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇచ్చిన ఇంట‌ర్వ్యూ ఇప్పుడు ఆన్ లైన్ ప్ర‌పంచంలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. సినిమాలు, రాజ‌కీయాలు, వ్య‌క్తిగ‌త జీవితం గురించి అన‌ర్గ‌ళంగా మాట్లాడిన ప‌వ‌న్‌… ఓ విష‌యంలో మాత్రం అభిమానుల్ని బాగా హ‌ర్ట్ చేశాడు. ప‌వ‌నిజం ప్ర‌స్తావ‌న తీసుకొచ్చిన సంద‌ర్భంలో అస‌లు ప‌వ‌నిజం అంటే ఏమిటో తెలీదని, ప్ర‌పంచంలో ఇన్ని ఇజాలుండ‌గా,.. కొత్త‌ది ఎందుక‌ని కాస్త వెట‌కారంగానే మాట్లాడాడు. ప‌వ‌నిజం ఫ్యాన్స్ నుంచి పుట్టుకొచ్చింద‌ని, కాబ‌ట్టి దాన్ని ఆపే బ‌లం త‌న‌కు సరిపోద‌న్నాడు ప‌వ‌న్‌. తాను రాజ‌కీయాల్లోకి వెళ్లిపోతే ఈ ప‌వ‌నిజం ఏమైపోతుందో త‌న‌కూ తెలీద‌ని.. కాస్త అయోమ‌యంగానే స‌మాధాన‌మిచ్చాడు ప‌వ‌న్‌.

ప‌వ‌న్ భావాల్ని, సిద్దాంతాల్నీ తూచ త‌ప్ప‌కుండా పాటిస్తూ, అదీ ప‌వ‌నిజం అని న‌మ్మే ప‌వ‌న్ ఫ్యాన్స్ మాత్రం ఈ మాట‌ల‌కు షాక్ తిన్నారు. ఎవ‌రి కోస‌మైతే వాళ్లింత‌గా తాప‌త్ర‌య‌ప‌డుతున్నారో, వాళ్లే… ప‌వ‌నిజంపై నెగిటీవ్ కామెంట్స్ చేయ‌డం.. ఫ్యాన్స్‌కి న‌చ్చ‌లేదు. దాంతో ప‌వ‌న్ పై వెర్రి అభిమానం పెంచుకొన్న అభిమానులు.. కాస్త హ‌ర్ట‌య్యార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. రెండు మూడు సినిమాల త‌ర‌వాత పూర్తిగా రాజ‌కీయాల‌పై దృష్టి పెడ‌తాన‌ని, సినిమాల గురించి ప‌ట్టించుకోన‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించినా అంత‌గా బాధ‌ప‌డ‌ని ఫ్యాన్స్‌.. ప‌వ‌నిజం పై ప‌వ‌న్ మాట్లాడిన తీరుకి మ‌న‌స్తాపం చెందాని కొంత‌మంది హార్డ్ కోర్ ప‌వ‌న్ ఫ్యాన్సే చెబుతున్నారు. ఇంట‌ర్వ్యూ అన్నాక‌… ఇలాంటివి కామ‌నే అని లైట్ తీసుకొంటున్న‌వాళ్లూ ఉన్నారు. ఇలాంటి ద‌శ‌లోనే ప‌వ‌న్ ఫ్యాన్స్ కాస్త పాజిటీవ్‌గా ఆలోచిస్తే మంచిది. ప‌వ‌నిజంలో అదీ ఓ భాగ‌మే అనుకొంటే స‌రిపోతుందిగా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close