ఎక్స్‌క్లూజీవ్‌: దొంగ గా ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ రీ ఎంట్రీ ఖాయ‌మైపోయింది. ఆయ‌న చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. ఒక‌టి పింక్‌. రెండోది క్రిష్ సినిమా. పింక్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ క్యారెక్ట‌ర్ గురించి కొత్త‌గా చెప్పేదేమీ లేదు. మాతృక‌లో అమితాబ్ చేసిన లాయ‌ర్ పాత్రే. అక్క‌డ ఆయ‌న వృద్ధ లాయ‌ర్‌గా క‌నిపిస్తే, ఇక్క‌డ‌… కాస్త యంగ్‌లో ఉన్న న్యాయ‌వాదిగానే క‌నిపించే అవ‌కాశం ఉంది.

ఇప్పుడు క్రిష్ సిన‌మాలో ప‌వ‌న్ పాత్ర ఏమిటన్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో ప‌వ‌న్ దొంగ‌గా క‌నిపించ‌నున్నాడు. మొఘ‌లాయిల కాలానికి సంబంధించిన క‌థ ఇది. మ‌హ‌మ్మ‌దీయుల ప‌రిపాల‌నా కాలం, అప్ప‌టి ప‌రిస్థితులు… ఇవ‌న్నీ తెర‌పై చూపించ‌బోతున్నారు. పిరియాడిక్ డ్రామా కోసం భారీ సెట్లు వేయ‌బోతున్నారు. దొంగ అనే అర్థం వ‌చ్చే టైటిల్ కోసం క్రిష్ బృందం క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఇప్ప‌టికే క్రిష్ పూర్తి స్థాయిలో క‌థ సిద్ధం చేసిన‌ట్టు సమాచారం. అయితే ప్రీ ప్రొడ‌క్ష‌న్ కి బాగా టైం తీసుకునే అవ‌కాశం ఉంది. కాస్ట్యూమ్స్‌, సెట్స్‌, అప్ప‌టి ఆయుధాలూ.. ఇవ‌న్నీ కావాల్సివ‌స్తుంది. ఈలోగా పింక్ మొద‌లెట్టే ఛాన్సుంద‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close