నిరుద్యోగ భృతిపై ప‌వ‌న్ మార్కు విమ‌ర్శ‌లు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిరుద్యోగ భృతి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌స్తుతం విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప్ర‌జా పోరాట యాత్ర‌ను ప‌వ‌న్ కొన‌సాగిస్తున్నారు. దీన్లో భాగంగా గ‌జ‌ప‌తిన‌గ‌రంలో ఆయ‌న మాట్లాడుతూ… తాము చేసిన అవినీతి ఏంట‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అంటున్నార‌నీ, అడుగ‌డుగునా అది క‌నిపించ‌డం లేదా అని ప్ర‌శ్నించారు. రైతుల పొలాల కోసం వెళ్తున్న నీళ్ల‌ను, తెలుగుదేశం పార్టీ నేత‌ల రొయ్య‌ల చెరువుల‌కు మ‌ళ్లిస్తున్నార‌ని ఆరోపించారు.

ఇక‌, నిరుద్యోగ భృతిపై విమ‌ర్శ‌ల విష‌యానికొస్తే… దీనికి డిగ్రీ, లేదా డిప్లొమా అర్హ‌త ఉండాలనంటే ఎలా అని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌లు మారుతున్నార‌నీ, ఆడ‌ప‌డుచులూ అక్క‌చెల్లెళ్లు మారుతున్నార‌నీ, యువ‌త మారుతోంద‌న్నారు. నిరుద్యోగ భృతిని రూ. వెయ్యి చొప్పున ప్ర‌క‌టించార‌నీ, అది కూడా అంద‌రికీ కాద‌న్నారు. డిగ్రీ చ‌ద‌వ‌క‌పోతే వారంతా యువ‌త కాదంట అంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటివి మోసం చేసే ప‌థ‌కాలు త‌ప్ప‌, యువ‌త‌కు న్యాయం చేసేవి కాద‌ని ప‌వ‌న్ మండిప‌డ్దారు. యువ‌త‌ను ఆక‌ర్షించే ప‌థ‌కాలు ప్రవేశపెట్టినంత మాత్రాన న‌మ్మే ప‌రిస్థితిల్లో ఏ ఒక్క‌రూ లేర‌ని ప‌వ‌న్ అన్నారు.

బాగా చ‌దువుకున్నవారికి అర్హతకు తగ్గ ఉద్యోగావ‌కాశాలు లేక‌పోయే స్థితినే నిరుద్యోగం అంటాం! అలాంటివారికి చేయూత‌నందించే ప‌థ‌కమే నిరుద్యోగ భ్రుతి. కాబ‌ట్టి, దీనికి డిగ్రీ లేదా డిప్లొమా అనేది క‌నీస అర్హ‌త‌గా పెట్టుకున్నారు. కానీ, ప‌వ‌న్ ఏమంటారంటే… డిగ్రీ చ‌ద‌వ‌నివారు యువ‌త కాదా, వారికి ఇవ్వ‌రా అన్న‌ట్టు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అదెలా సాధ్య‌మౌతుంది..? విద్యార్హ‌త ఉన్నా లేకున్నా యువ‌త అంద‌రినీ నిరుద్యోగులుగా చూడాలంటే.. ఆచ‌ర‌ణ సాధ్య‌మా..?

టీడీపీని విమ‌ర్శించి తీరాల‌న్న గ‌ట్టి ల‌క్ష్యంతో ప‌వ‌న్ యాత్ర‌కు దిగారు కాబ‌ట్టి, ప్ర‌తీరోజూ ఏదో ఒక అంశాన్ని ప‌ట్టుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తప్పులేదు, రాజ‌కీయాల్లో విమ‌ర్శించుకునే స్వేచ్ఛ క‌చ్చితంగా ఉంటుంది. కాక‌పోతే, ప‌థ‌కాల విష‌యంలో ఆచ‌ర‌ణ సాధ్యం కాని వ్యాఖ్యానాలు ప‌వ‌న్ చేస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం. నిరుద్యోగ భృతికి క‌నీస అర్హ‌త వ‌ద్దంటే ఎలా..? అమ‌లు చేస్తున్న ప‌థ‌కాన్ని కూడా వంచ‌నా, మోసం, మ‌భ్య‌పెట్ట‌డం అంటూ అభివర్ణిస్తుంటే ఎలా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close