ఎర్రచందనం స్మగ్లర్ల ఆటలు ఇక ముందు సాగకూడదని అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తిరుపతిలో అటవీప్రాంతం, ఎర్రచందనం గోడౌన్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులను ఏరివేయడానికి ఆపరేషన్ కగార్ ఎలా నిర్వహించారో.. ఎర్రచందనం స్మగ్లర్లను కూడా అలాంటి పద్దతుల ద్వారానే ఏరివేస్తామని హెచ్చరించాహు.
2019 నుంచి 2024 మధ్య కాలంలో 8 నుంచి 10 వేల కోట్ల ఎర్ర చందనం స్మగ్లింగ్ జరిగిందన్నారు. ప్రస్తుతం గోడౌన్ లో దొంగల నుంచి పట్టుబడ్డ 2.65 లక్షలు దుంగలు ఉన్నాయి. అంటే లక్ష 30 వేల చందనం చెట్టు అడ్డగోలుగా నరికివేసినట్లు భావించాలి. పట్టుబడకుండా స్మగ్లింగ్ లో తరలిపోయింది ఇంకా చాలా ఉంది. మన నుంచి తరలిపోయి కర్ణాటక లో ఎర్రచందనం పట్టుబడింది. వాటిని మ్మి కర్ణాటక సర్కారు 140 కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు. అప్పుడు ఉన్న మంత్రులు ఎవరూ బాధ్యతలు తీసుకోలేదన్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నలుగురు కింగ్ పిన్ లను గుర్తించామని.. వారిని త్వరలో పట్టుకుంటామని పవన్ తెలిపారు. తమిళనాడు వాళ్లకు కూడా ఇదే చెబుతున్నాను…ఎర్రచందనం చెట్లను నరికే వృత్తిలోకి వెళ్లవద్దన్నారు. ఇదే నా వార్నింగ్ … స్మగ్లింగ్ జోలికి వెళితే తాట తీస్తానని ప్రకటించారు. మహారాష్ట్ర నిర్వహించిన ఆపరేషన్ కగర్ లాగా ఇక్కడ మరో ఆపరేషన్ చేపడతామన్నారు. ఎర్ర చందనం చెట్లు కొట్టాలంటే భయపడే స్థితికి తీసుకు వస్తామన్నారు.
పవన్ మంగళం అడవుల్లో చెట్లు నాటారు. రెండు గంటల పాటు అడవిలో తిరిగారు. గోడౌన్లో దంగల్ని పరిశీలించారు. అన్నింటికీ జీపీఎస్ ఉండాలని సూచించారు. పవన్ కల్యాణ్.. ఆర్మీ తరహా డ్రెస్ తో వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
