రాజధాని గ్రామ రైతులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి

పవన్ కళ్యాణ్ ఉండవల్లి, పెనుమాక తదితర రాజధాని ప్రాంత గ్రామాలతో ఆదివారం సమావేశమయ్యారు. వారి సమస్యలన్నిటినీ సావధానంగా విన్న తరువాత ఆయన వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నేను ఒక రాజకీయ నాయకుడిగానో లేకపోతే ఒక నటుడిగానో ఇక్కడికి రాలేదు. సాటి రైతుగానే వచ్చాను. అలాగే తెదేపా నేతలతోనో ప్రభుత్వంతోనో గొడవ పెట్టుకొనేందుకు కూడా రాలేదు. కానీ రైతుల కోసం అవసరమయితే గొడవ పెట్టుకోవడానికి కూడా వెనుకాడను. నాకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో సహా ఏ పార్టీ మీద ద్వేషం లేదు. రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో మళ్ళీ అనిశ్చిత రాజకీయ వాతావరణం ఏర్పడకూడదనే ఉద్దేశ్యంతో నేను తెదేపా, బీజేపీలకు మద్దతు ఇచ్చాను. అందుకోసం తండ్రి తరువాత తండ్రి అంతటివాడయిన అన్నయ్యను కూడా వ్యతిరేకించి ఆయన మనసుని గాయపరిచి నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకిస్తూ తెదేపా, బీజేపీలకి మద్దతు ఇచ్చాను. కనుక తెదేపా నన్ను మిత్రపక్షంగా భావించడం సహజమే. కానీ అంత మాత్రాన్న నేను దానికి బానిసని కానని గ్రహించాలి. ప్రజల కోసం పనిచేస్తున్నంత కాలం ఏ పార్టీకయినా నేను మద్దతు ఇస్తాను. చేయకపోతే తప్పకుండా నిలదీస్తాను.”

“రైతుల ప్రయోజనాలు కాపాడమని నేను చాలా మర్యాదగా అడిగితే, దానికి మంత్రులు రావెల కిషోర్ బాబు, యనమల రామకృష్ణుడు చాలా వ్యంగంగా సమాధానాలు ఇచ్చారు. మంత్రి రావెల ఆఫ్టరాల్ 3500 ఎకరాలకి ఇంత రాద్దాంతం ఎందుకు అన్నారు. 3, 500 ఎకరాలు ఆయనకి ‘ఆఫ్టరాల్’ కావచ్చు, కానీ రైతుల గోడు ఆయనకీ రాద్దాంతంగా కనబడటం చాలా దురదృష్టకరం. కొన్ని సెంట్ల భూమి మీద కూడా ఆధారపడిన కుటుంబాలున్నాయిక్కడ. ఇక్కడ భూముల మీద వచ్చే రాబడితో కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి బ్రతుకుతున్నాయి. కనుక మంత్రులు మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది. గత ప్రభుత్వం హైదరాబాద్ లో రింగ్ రోడ్డు వేస్తున్నప్పుడు తెదేపా ఎంపీ మురళీ మోహన్ గారికి చెందిన గల భూమి పోయినప్పుడు ఆయన తనభూమిని కాపాడుకోవడం కోసం హైకోర్టు, సుప్రీం కోర్టుకి కూడా వెళ్లి పోరాడారు. కానీ అదే ఇక్కడి రైతులు ప్రభుత్వం తమ భూములు ఎందుకు లాక్కొంటోంది అని ప్రశ్నించినపుడు మన మంత్రులకి ఎందుకు కోపం వస్తోందో తెలియదు. భూమి పోగొట్టుకొంటే ఆ కష్టం ఏమిటో ఆయనకీ తెలుసు. కనుక ఆయనే ఇక్కడికి వచ్చి రైతుల తరపున నిలబడి మాట్లాడితే బాగుంటుంది.”

“ప్రభుత్వం ఇక్కడ రాజధాని నిర్మిస్తానన్నప్పుడే రైతులు కన్నీళ్లు పెట్టుకొంటే అది రాష్ట్రానికి మంచిది కాదని చెప్పాను. అందరం కలిసి ఆనందంగా రాజధాని నిర్మాణం చేసుకోవాలి కానీ కన్నీళ్ళతో కాదు. నేను ఈవిధంగా మాట్లాడుతుంటే రాజధాని నిర్మాణానికి, రాష్ట్రాభివృద్ధిని వ్యతిరేకిస్తున్నానని నా గురించి ప్రభుత్వంలో కొందరు ప్రచారం చేస్తున్నారు. హూద్ హూద్ తుఫాను సమయంలో చంద్రబాబు నాయుడు విశాఖలో చేసిన సహాయ, పునరావాస చర్యలు చూసి అటువంటి అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రిగా ఉన్నందునే అది సాధ్యమయిందని ఆయనను మెచ్చుకొన్నాను. అప్పుడు నావద్ద ఉన్న రూ.50 లక్షలను కూడా విరాళంగా ఇచ్చాను. అప్పుడు నేను ప్రభుత్వానికి మద్దతు ఇస్తే అందరూ మెచ్చుకొన్నారు. కానీ ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సహించలేకపొతున్నారు ఎందుకు? నేనేమీ ప్రభుత్వాన్ని రాజధాని నిర్మించవద్దని చెప్పడం లేదు. రైతులను ప్రభుత్వానికి భూములు ఇవ్వవదని చెప్పడం లేదు. రైతుల నుండి బలవంతంగా భూములు స్వాధీనం చేసుకోవద్దని మాత్రమే చెపుతున్నాను.”

“మంచి పరిపాలనానుభావం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మించారు. అనేక సమస్యలను, సవాళ్ళను ఎదుర్కొని పరిష్కరించారు. కనుక సున్నితమయిన ఈ సమస్యను కూడా సానుకూలంగా చర్చించి పరిష్కరించమని మాత్రమే నేను కోరుతున్నాను. అందుకోసం జయ ప్రకాష్ నారాయణ్ వంటి మేధావులు, నిపుణులతో కూడిన కమిటీ వేసి చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించమని కోరుతున్నాను.”

“రాజకీయ పార్టీలు పెట్టుకొన్నది రోడ్డున పడికొట్టుకోవడానికి కాదు. అందుకే అయితే పార్టీలు పెట్టుకోవడం కూడా అనవసరం. ఈ సమస్యని చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోనేందుకే అన్ని పార్టీలు కృషి చేయాలి తప్ప ఈ సమస్యను రాజకీయం చేయడం కోసం పోరాడటం మంచి పద్ధతి కాదు. ఆఖరిగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ ప్రాంతాలలో బలవంతంగా భూసేకరణ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులు లేవనెత్తిన అభ్యంతరాలని, సమస్యలని అన్నిటినీ పూర్తిగా పరిష్కరించి మాత్రమే ముందుకు సాగాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ నేను తెలుసుకొన్న విషయాలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తాను. ఆయన ప్రతిస్పందనను బట్టి నా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాను. కొందరు ఆరోపిస్తున్నట్లుగా నేను ఎక్కడికి పారిపోవడం లేదు. అవసరమయితే వచ్చి పోరాటం చేయడానికి నేను సిద్దం. కానీ ఈ సమస్యని ప్రభుత్వమే సామరస్యంగా పరిష్కరిస్తే అందరూ సంతోషిస్తారు,” అని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close