అఫీషియ‌ల్‌: సంక్రాంతి బ‌రిలో ప‌వ‌న్

ప‌వ‌న్ క‌ల్యాణ్ – క్రిష్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఏఎం ర‌త్నం నిర్మాత‌. నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌. ఈ సినిమా 2022 సంక్రాంతికి విడుద‌ల కానుంద‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. దాన్ని ఇప్పుడు చిత్ర‌బృందం కూడా ఖ‌రారు చేసింది. ప‌వ‌న్ సినిమాకి 2022 సంక్రాంతికి విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ శివ‌రాత్రికి టైటిల్ ప్ర‌కటిస్తారు. ఫ‌స్ట్ లుక్ కూడా ఆరోజే విడుద‌ల చేస్తారు. `విరూపాక్ష‌`, `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. `వీర‌మ‌ల్లు` టైటిల్ నే ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న క‌థ ఇది. ప‌వ‌న్ క‌ల్యాణ్.. గ‌జ‌దొంగ‌గా నంటించ‌బోతున్నాడు. కోహినూర్ వ‌జ్రం ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర పోషించ‌నుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అచ్చెన్నపై స్టింగ్ ఆపరేషన్..!

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రైవేటు సంభాషణలను స్టింగ్ ఆపరేషన్ పేరుతో కొంత మంది సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఆ వీడియోలను వైసీపీ అనుకూల మీడియా విస్తృతంగా సర్క్యూలేట్ చేస్తోంది. ప్రధానంగా...

కర్ణాటక డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలు – రాజకీయ కుట్ర ఉందా ?

తెలంగాణ రాజకీయ నేతలపై బెంగళూరు పోలీసులు మీడియాకు ఇస్తున్న లీకులపై తెలంగాణ రాజకీయ నేతల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా రాజకీయం ఉందని అనుమానిస్తున్నారు. బెంగళూరులో అధికారంలో ఉన్న బీజేపీనే .... డ్రగ్స్...

టాలీవుడ్ కి ఉగాది శోభ‌

పోయిన ఉగాది... `క‌రోనా` పుణ్యాన రుచీ ప‌చీ లేకుండా చ‌ప్ప‌గా సాగిపోయింది. ఈసారి క‌రోనా భ‌యాలు ఉన్నా... టాలీవుడ్ లో శోభ క‌నిపించింది. ప్ర‌తీ ఉగాదికీ.. టాలీవుడ్ లో కొత్త సినిమాలు మొద‌లు...

బాల‌య్య టైటిల్ `అఖండ`

బోయ‌పాటి శ్రీ‌ను షాకిచ్చాడు. బాల‌కృష్ణ సినిమా కోసం ఓ కొత్త టైటిల్ ప్ర‌క‌టించి, అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పరిచాడు. బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ...

HOT NEWS

[X] Close
[X] Close