విశాఖలో విపక్షాలు ఊహించని రేంజ్‌లో విజయసాయి రాజకీయం..!

విశాఖలో వైసీపీని గెలిపించే బాధ్యతను భుజానకు ఎత్తుకున్న విజయసాయిరెడ్డి అక్కడ చేస్తున్న రాజకీయం అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ప్రజలు ఓట్లు వేస్తే వైసీపీ అభ్యర్థులు గెలుస్తారో లేదోనన్న సందేహం గట్టిగా ఉందేమో కానీ.. ఇతర పార్టీల అభ్యర్థుల్ని పోటీ నుంచి తప్పించడానికి చేయాల్సిందంతా చేస్తున్నారు. ఆయన పోటీ నుంచి వైదొలిగే అభ్యర్థికి రూ. కోటి ఆఫర్ చేస్తున్నారని సీపీఐ నేత రామకృష్ణ చెబుతున్నారు. విజయసాయిరెడ్డి చేస్తున్న రాజకీయం దారుణంగా ఉందని… అయితే పోలీసులు లేకపోతే డబ్బుల్ని ఉపయోగించి రాజకీయం చేస్తున్నారని ఆయనంటున్నారు. మరో వైపు కుల సమీకరణాల్ని వైసీపీకి అనుకూలంగా మార్చేందుకు కుల సంఘాల భేటీలు ఏర్పాటు చేస్తున్నారు.

వైసీపీకి రెడ్డి సామాజికవర్గం అండగా ఉంటుంది. ఉత్తరాంధ్రలో ఆ సామాజికవర్గం తక్కువ. అందుకే.. రెడ్డిక అనే మరో బీసీ సామాజికవర్గాన్ని రెడ్డిల్లో కలిపేసి.. కుల సమావేశం పెట్టేశారు. నిజానికి రెడ్డిక అనేది బీసీ సామాజికవర్గం. కోస్తా, సీమ రెడ్లకు.. ఉత్తరాంధ్ర రెడ్డికలకు అసలు సంబంధమే లేదు. అయినప్పటికీ.. వైసీపీకి కులం బలం కల్పించడానికి రెడ్డికలను రెడ్లుగా సంబోధిస్తూ.. స్టార్ హోటల్లో భారీ ఖర్చుతో విందు ఏర్పాటు చేసి.. రెడ్డికలు అందరూ వైసీపీకే ఓటేయాలని పిలుపునిచ్చారు. ఆయన పిలుపు కూడా విచిత్రంగా ఉంది. వైసీపీ ఎక్కువ మంది అభ్యర్థుల్ని రెడ్డికల్ని నిలబెట్టకపోయినా టీడీపీ అభ్యర్థుల్ని నిలబెట్టినా… కుల పక్షపాతం చూపించకుండా వారంతా వైసీపీకే ఓటు వేయాలని విజయసాయిరెడ్డి కోరారు.

రెడ్డికలు కులపక్షపాతంతో ఓటు వేస్తారన్నట్లుగా ఆయన మాట్లాడారు. ఆ తర్వాత రెడ్డికను .. రెడ్డి సామాజికవర్గంలో కలుపుకునే ప్రయత్నం చేశారు. అసలు విజయసాయిరెడ్డి ఎందుకింత హడావుడి చేస్తున్నారనేదానిపై ఇతర పార్టీల నేతలు కుట్ర అనే కారణం చెబుతున్నారు. వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించి స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ లేదని చెప్పాలని అనుకుంటున్నారని వారంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి విశాఖలో తన రాజకీయం అంతా చూపిస్తున్నారు. మరి గెలుస్తారో లేదో..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అచ్చెన్నపై స్టింగ్ ఆపరేషన్..!

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రైవేటు సంభాషణలను స్టింగ్ ఆపరేషన్ పేరుతో కొంత మంది సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఆ వీడియోలను వైసీపీ అనుకూల మీడియా విస్తృతంగా సర్క్యూలేట్ చేస్తోంది. ప్రధానంగా...

కర్ణాటక డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలు – రాజకీయ కుట్ర ఉందా ?

తెలంగాణ రాజకీయ నేతలపై బెంగళూరు పోలీసులు మీడియాకు ఇస్తున్న లీకులపై తెలంగాణ రాజకీయ నేతల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా రాజకీయం ఉందని అనుమానిస్తున్నారు. బెంగళూరులో అధికారంలో ఉన్న బీజేపీనే .... డ్రగ్స్...

టాలీవుడ్ కి ఉగాది శోభ‌

పోయిన ఉగాది... `క‌రోనా` పుణ్యాన రుచీ ప‌చీ లేకుండా చ‌ప్ప‌గా సాగిపోయింది. ఈసారి క‌రోనా భ‌యాలు ఉన్నా... టాలీవుడ్ లో శోభ క‌నిపించింది. ప్ర‌తీ ఉగాదికీ.. టాలీవుడ్ లో కొత్త సినిమాలు మొద‌లు...

బాల‌య్య టైటిల్ `అఖండ`

బోయ‌పాటి శ్రీ‌ను షాకిచ్చాడు. బాల‌కృష్ణ సినిమా కోసం ఓ కొత్త టైటిల్ ప్ర‌క‌టించి, అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పరిచాడు. బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ...

HOT NEWS

[X] Close
[X] Close