ప‌వ‌న్ – క్రిష్‌.. అప్ డేట్స్‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ – క్రిష్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే క్లాప్ కొట్టారు. కొంత‌మేర షూటింగ్ కూడా జ‌రిపారు. ఇప్పుడు రెండో షెడ్యూల్ మొద‌ల‌వ్వ‌బోతోంది. ఈనెల 8 నుంచి హైద‌రాబాద్‌లో కొత్త షెడ్యూలుకు శ్రీ‌కారం చుడుతున్నారు. అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఈ సినిమా కోసం ప్ర‌త్యేక‌మైన సెట్లు రూపొందించారు. అక్క‌డే సింహ భాగం షూటింగ్ జ‌ర‌గ‌బోతోంది. ఈసారి ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాలు తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలుస్తోంది. 8వ తేదీన సెట్లో ప‌వ‌న్ అడుగుపెట్ట‌నున్నాడ‌ని టాక్‌. ఔరంగ‌జేబు ప‌రిపాల‌నా కాలం నాటి క‌థ ఇది. అప్ప‌టి సాంఘిక‌, ఆర్థిక, రాజ‌కీయ ప‌రిస్థితుల్ని తెర‌పై చూపించ‌బోతున్నారు. కోహినూర్ వ‌జ్రం చుట్టూ క‌థ న‌డ‌వ‌బోతోంద‌ని టాక్‌. ఇద్ద‌రు క‌థానాయిక‌లు ఈ చిత్రంలో క‌నిపించ‌బోతున్నార‌ని, అందులో ఓ క‌థానాయిక జాక్విలెన్ ఫెర్నాండేజ్ అని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే చిత్ర‌బృందం అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close