మహేష్ బర్త్ డే.. పవన్ స్పెషల్ పోస్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు ఆయనకు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మహేష్ ఎప్పుడూ సంతోషంగా వుండాలని కోరుతున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఏదో ఫార్మల్ గా కాకుండా మహేష్ తో తన అనుబంధంని గుర్తు చేసుకుంటూ ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చేయడం ఆసక్తికరంగా వుంది.

”మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తనదైన శైలి నటనతో నవతరం ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఆయన చేపట్టే సేవా కార్యక్రమాలు… హృద్రోగంతో బాధపడే చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయించడం అభినందనీయం. కృష్ణ గారి నట వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ.. తండ్రి బాటలోనే దర్శకులకు, నిర్మాతలకు అండగా నిలుస్తున్నారు. ‘అర్జున్’ సినిమా సందర్భంలో పైరసీపై పోరాటానికి మహేష్ బాబు గారు తన గళం వినిపిస్తే ఆయనకు మద్దతుగా నిలిచాను. పరిశ్రమను కాపాడుకొనేందుకు ఆయన ముందుకు రావడంతో అందరం వెన్నంటి నిలిచాం. ‘జల్సా’ సినిమాలో సంజయ్ సాహూ పాత్రను పరిచయం చేసేందుకు మహేష్ బాబు గారి నేపథ్య గాత్రం అయితే బాగుంటుందని, దర్శకులు త్రివిక్రమ్ గారు కోరగానే అంగీకరించిన సహృదయత మహేష్ బాబు గారిది. కథానాయకుడిగా తనదైన పంథాలో వెళ్తూ ప్రేక్షకుల మెప్పు, పురస్కారాలూ అందుకొంటున్న మహేష్ బాబు గారు మరిన్ని విజయాలు అందుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని ఒక స్పెషల్ పోస్ట్ రాసుకొచ్చారు పవన్ కళ్యాణ్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవార్డుల్ని చూసి మురిసిపోతున్న కేటీఆర్ – టీడీపీ కూడా అంతే !

సేమ్ టు సేమ్ అని ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం.. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వాలను చూస్తే చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది. రాజకీయంగా బీజేపీతో పోరాటం విషయంలో... కేసీఆర్ సుకుంటున్న నిర్ణయాల...

మునుగోడులో పోటీ చేసేది టీఆర్ఎస్సా ? బీఆర్ఎస్సా ?

తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక నుంచి భారత రాష్ట్ర సమితి అధినేతగా వ్యవహరించనున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ మొదటి లక్ష్యం మునుగోడు ఉపఎన్నిక. రెండు...

చరిత్రలో కలిసిన టీఆర్ఎస్.. ఇక నుంచి భారత్ రాష్ట్ర సమితి !

తెలంగాణ రాష్ట్ర సమితి అంతర్థానం అయింది. తమ పార్టీని భార‌త్ రాష్ట్ర స‌మితిగా సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. జాతీయ పార్టీగా మారుస్తూ ఏక‌గ్రీవ తీర్మానం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)...

మునుగోడులో పాల్ పార్టీ అభ్యర్థిగా గద్దర్ !

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తన మ్యాజిక్‌ను అప్పుడప్పుడూ ప్రదర్శిస్తూ ఉంటారు. తన మాటలతో ఈ సారి గద్దర్ నే పోటీకి ఒప్పించారు. మునుగోడులో ప్రజాశాంతి పార్టీ తరపున గద్దర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close