ఔను పవన్… రైల్వేజోన్, మోడీ వెనక్కి తీసుకున్న నిధులు గుర్తుకు రాలేదేమి..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర వాసుల్ని రెచ్చగొట్టేందుకు.. ఆవేశంతో ప్రసంగిస్తూ ..మధ్యమధ్యలో గుండెలు బాదేసుకుంటూ ఉంటారు. అదే పనిగా.. ఉత్తరాంధ్ర వెనుకబడిపోయిందని.. కథలు కథలుగా చెబుతూ ఉంటారు. తెలంగాణలా ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం వస్తుందని తేల్చేశారు. ఎప్పటికైనా ప్రత్యేక రాష్ట్రం ఖాయమని తీర్పిచ్చేశారు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. రాష్ట్ర ప్రభుత్వం తరపున… ఏం అన్యాయం జరిగిందో పవన్ సహా చర్చల్లో పాల్గొన్న మేధావులెవరూ విడమర్చి చెప్పలేకపోయారు. మిగతా ఏపీ మొత్తం… ఉన్న సమస్యలే ఉత్తరాంధ్రలోనూ ఉన్నాయి. కానీ ఒక్క ఉత్తరాంధ్రలో ఉన్నట్లే పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఆయనతో సమావేశానికి వచ్చిన మేధావులు తలలు ఊపారు. అంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇప్పటికిప్పుడు .. ఉత్తరాంధ్రను అత్యంత దారుణంగా మోసం చేసిన రెండు ఘటనలపై… పవన్ సహా మేధావులెవరికీ నోరు మెదపడానికి ధైర్యం చాలలేదు.

దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర వాసుల కల విశాఖ రైల్వే జోన్. దాని కోసం ఏళ్లుగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. చివరికి రాష్ట్ర విభజన చేస్తూ.. ఏపీకి ఇచ్చిన హామీల్లో దాన్ని కూడా చేర్చారు. ఇక కల సాకారం అవుతుందనే అనుకున్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ ను ఇంకా పరిశీలిస్తూనే ఉందట. చట్టంలో ఉంది కాబట్టి.. ఆ పరిశీలన కూడా చేస్తున్నామని వెటకారాలు చేశారు రైల్వే మంత్రి. ఉత్తరాంధ్ర వెనుకబడిపోయిందని… రోజంతా చర్చలు జరిపిన మేధావులకు.. ఈ రైల్వేజోన్ అంశం… అసలు గుర్తుకు కాలేదు. ముఖ్యంగా… ఉత్తరాంధ్రను కళింగాంధ్రగా మార్చి ఉద్యమం చేయాలనుకుంటున్న పవన్ కల్యాణ్ కి అస్సలు గుర్తుకు రాలేదు.

ఇదే కాదు.. కేంద్రం ఉత్తరాంధ్రలోని వెనుకబడిన జిల్లాకు అత్యంత అవమానించిన మరో సందర్భంగా కూడా.. ఈ మేధావులు చర్చించలేపోయారు. విభజన చట్టం ప్రకారం.. ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలకు.. కేంద్ర ఆర్థిక శాఖ కొన్నాళ్ల క్రితం రూ. 350 కోట్లు నిధులు విడుదల చేసింది. కానీ మోడీ కార్యాలయం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని మళ్లీ వెనక్కి తీసేసుకున్నారు. ఏపీ ప్రభుత్వం దీన్ని బయటపెట్టినా.. మళ్లీ ఆ నిధులు విడుదల చేయలేదు. ఉత్తరాంధ్ర వెనుకబాటుపై చర్చలు జరిపిన మేధావులకు.. ఈ అవమానం కనిపించలేదు. పవన్ కల్యాణ్ కు అసలు తెలియదు కూడా.

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఊరికే .. ఉత్తరాంధ్ర పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మీద.. టీడీపీ మీద ప్రజలను ఎగదోయడానికే ప్రయత్నిస్తున్నారనేది చాలా మంది చేస్తున్న ఆరోపణలు. రైల్వేజోన్, నిధులు ఇచ్చి వెనక్కి తీసుకున్న ఘటనలపై కేంద్రాన్ని విమర్శించడానికి నోరే రాకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ప్రభుత్వం అన్యాయం చేస్తోంది.. చేస్తోంది అంటున్నారు..కానీ బలంగా ఒక్క కారణం చూపించలేకపోయారు. కానీ కేంద్రం ప్రత్యక్షంగా చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి నోరు రాదు. ఇదీ జనేసనాధినేత చేసే… రాజకీయం

…..సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close