మోడీ రాజకీయానికి కొత్త ఆయుధం “కబీర్”

ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఊపందుకుంటున్న సమయంలోనే నరేంద్రమోదీ.. గేర్ మారుస్తున్నారు. యూపీలో మెజార్టీ సీట్లు సాధించకపోతే.. అధికారం కల్ల అని తేలడంతో.. అక్కడే దృష్టి పెట్టారు. అనధికారికంగా ఈ రోజు నుంచి యూపీలో ప్రచారపర్వం ప్రారంభిస్తున్నారు. అదీ కూడా.. పట్టు సాధించాల్సిన తూర్పు యూపీ నుంచి శంఖరావం పూరిస్తున్నారు. మోదీ తాను గత ఎన్నికల్లో గెలిచిన వారణాసికి పూర్తి భిన్నమైన కబీర్‌ నగర్‌లో మోదీ పర్యటన ఇపుడు హాట్‌ టాపిక్‌గా మారింది. నాలుగేళ్లలో మోడీ ఎప్పుడీ కబీర్‌ను గుర్తుకు తెచ్చుకోలేదు. కానీ హఠాత్తుగా కబీర్‌పై పొగడ్తలు గుప్పించిన మోదీ.. సడెన్‌గా ఆయన సమాధికి చాదర్‌ సమర్పించేందుకు వెళ్తున్నారు.

మగర్‌… కబీర్‌ సమాధి స్థలం. ఇపుడు మోదీకి ఈ పేరు గుర్తుకురావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా యూపీలోని అగ్రవర్ణాలకు మోదీ నిర్ణయం ఏ మాత్రం నచ్చడం లేదు. వారణాసి విరుద్ధం మగర్‌. వారణాసి స్వర్గానికి దారి చూపితుందన్న ప్రసిద్ధి ఉంటే.. మగర్‌లో మరణిస్తే నరకానికి వెళ్తారంటారు. కానీ అప్పటి అగ్రవర్ణాల తీరుతో విభేదించిన కబీర్‌ సాధువు… వారణాసి నుంచి కాకుండా మగర్‌లో సమాధి అయ్యారు. అయితే ఇపుడు కబీర్‌ సమాధికి చాదర్‌ సమర్పించాలని మోదీ నిర్ణయించడంతో.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయొచ్చన్న ఉహాగానాలు ఊపందుకుంటున్నాయి.

మోడీ కబీర్‌ నామ జపం వెనుక భారీ వ్యూహం ఉంది. కబీర్‌కు తూర్పు యూపీలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. కబీర్‌ పంతీస్‌ అంటూ భారీ అనుచరణ వర్గం కూడా యాక్టివ్‌గా ఉంది. వీరిలో అత్యధికులు దళితులు. అంతేకాదు.. ముస్లింలలోనూ కబీర్‌పై సానుకూలత ఉంది. అయితే ఇపుడు వారిని ఆకట్టుకునేందుకు మోదీ కబీర్‌ జపం చేస్తున్నారు. దళితులు, మైనార్టీ వర్గాల్లో బీజేపీపై వ్యతిరేకత ఉంది. ఇపుడు కబీర్‌ పేరుతో ఆ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం మోదీ చేస్తున్నారు. దానికి ఈ రోజే ముహుర్తం పెట్టుకున్నారు. మోడీ రాజకీయ ఎత్తుగడలు అన్నీ ఇలాగే ఉంటాయి. ఎంత వరకు సక్సెస అవుతాయన్నది ఎన్నికల తర్వాతే తేలుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close