‘యాత్ర 2’కి పోటీగా ప‌వ‌న్ సినిమా

ఏపీలో ఎల‌క్ష‌న్ హీట్ రోజు రోజుకీ పెరుగుతోంది. నోటిఫికేష‌న్ ఇంకా రాక‌పోయినా… ఇప్ప‌టికే ఎన్నిక‌ల క‌ళ వ‌చ్చేసింది. రాజ‌కీయ పార్టీలు త‌మ ప్ర‌చారాన్ని మ‌రింత ఉధృతం చేస్తున్నాయి. వాటికి సినిమాలూ.. ఇతోదికంగా సాయం చేస్తున్నాయి. వైకాపాకి బూస్ట‌ప్ ఇవ్వ‌డానికి ‘యాత్ర 2’ రెడీ అవుతోంది. ఫిబ్ర‌వ‌రి 9న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. అదే రోజున ప‌వ‌న్ క‌ల్యాణ్ ‘కెమెరామెన్ గంగ‌తో రాంబాబు’ సినిమాని రీ రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌లు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. ప‌వ‌న్ సినిమాల్లో పొలిటిక‌ల్ హీట్ ఉన్న సినిమా.. ‘గంగ‌తో రాంబాబు’. అందులో పొలిటిక‌ల్ సెటైర్లు బాగా పేలాయి. ఎన్నిక‌ల వేళ‌… ఈ సినిమాని రీరిలీజ్ చేస్తే ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి కాస్త హుషారు వ‌స్తుంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. ఆ రోజుల్లో బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఈ సినిమా పెద్ద‌గా ప్ర‌భావితం చేయ‌లేదు. కాక‌పోతే రీ రిలీజుల‌కు మంచి గిరాకీ ఏర్ప‌డింది. ‘ఆరెంజ్‌’ లాంటి డిజాస్ట‌ర్లు రిలీజ్ చేసినా, జ‌నం బాగానే చూస్తున్నారు. పైగా పొలిటిక‌ల్ సీజ‌న్ ఆయె. అందుకే రాంబాబు మ‌ళ్లీ రంగంలోకి దిగుతున్నాడు. రిలీజ్ డేట్ ఇంకా ఖ‌రారు కాలేదు. కాక‌పోతే ఫిబ్ర‌వ‌రి 9న ‘యాత్ర‌’కు పోటీగా రావ‌డం ఖాయ‌మ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పుష్ష 2: ఇంట్ర‌వెల్ లో ‘జాత‌రే..’

ఈ యేడాది విడుద‌ల అవుతున్న క్రేజీ ప్రాజెక్టుల‌లో 'పుష్ష 2' ఒక‌టి. ఆగ‌స్టు 15న 'పుష్ష 2'ని విడుద‌ల చేయ‌డం కోసం చిత్ర‌బృందం రేయింబ‌వ‌ళ్లూ క‌ష్ట‌ప‌డుతోంది. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో...

చిరు సినిమాలో ఆషికా రంగ‌నాథ్‌?

సంక్రాంతికి వ‌చ్చిన సినిమాల్లో 'నా సామిరంగ‌' ఒక‌టి. నాగార్జున స‌ర‌స‌న ఆషికా రంగ‌నాథ్ మెరిసింది. త‌న స్క్రీన్ ప్ర‌జెన్స్ తో ఆక‌ట్టుకొంది. సీరియ‌ర్ హీరోల‌కు ఆషికా మంచి ఛాయిస్ అని.. అంతా అనుకొన్నారు....

రాజాసాబ్‌: సెకండాఫ్‌… స్పెల్‌బౌండ్!

'స‌లార్‌'తో మ‌రో సూప‌ర్ హిట్టు కొట్టాడు ప్ర‌భాస్‌. ఇప్పుడు త‌న దృష్టంతా క‌'ల్కి', 'రాజాసాబ్‌'ల‌పై ఉంది. రెండింటికీ త‌న కాల్షీట్లు పంచుతున్నాడు. రాజాసాబ్ చిన్న చిన్న షెడ్యూల్స్‌తో మెల్ల‌గా పుంజుకొంటోంది. ఈ సినిమాకు...

వైసీపీలో అందరూ చర్చకు సిద్ధమే .. జగన్ రెడ్డి తప్ప !

వైసీపీలో అధినేత జగన్ రెడ్డి తప్ప.. తామంతా పోటుగాళ్లమేనని నిరూపించుకునేందుకు ఒకరి తర్వాత ఒకరు పోటీ పడుతున్నారు. కానీ అసలు జగన్ రెడ్డి మాత్రం చర్చకు వస్తానని చెప్పడం లేదు. తాజాగా అంబటి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close