యనమలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన పవన్

హైదరాబాద్: భూసేకరణపై తనను ఎద్దేవా చేస్తూ ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై పవన్ ఘాటుగా స్పందించారు. భూసేకరణ చేయకుండా రాజధాని నిర్మించటానికి ఇదేమీ త్రిశంకు స్వర్గంకాదని, తాము విశ్వామిత్రులం కామని అన్న యనమల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ముందు కట్టేది స్వర్గమనేది తెలిస్తే, అది త్రిశంకు స్వర్గమా, రెగ్యులర్ స్వర్గమా అనేది తర్వాత ఆలోచించొచ్చని అన్నారు. సినిమా పరిశ్రమకు హైదరాబాద్‌లో ఇచ్చినవి కొండలు…బహుళ పంటలు పండే పొలాలు కాదని, ఇది రామకృష్ణుడికి తెలియదనుకుంటా అని ట్వీట్ చేశారు. హైదరాబాద్‌ కొండల్లోగానీ, విశాఖపట్నం కొండల్లోలోగానీ తనకు స్టూడియోలు లేవని తెలిపారు. తాను ఎంతో బాధ్యతతో రైతుల సమస్యని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే విజ్ఞతతో స్పందించటంమానేసి రైతుల ఆవేదనను వెటకారం చేయటం వారికే చెల్లిందని పేర్కొన్నారు. త్వరలో బేతపూడి, ఉండవల్లి, పెనుమాక తదితర నదీ పరీవాహక గ్రామాల రైతులను కలుస్తానని తెలిపారు.

మరోవైపు గుంటూరుజిల్లా మంగళగిరి పట్టణంలో పవన్ ఫోటోకు రైతులు, జనసేన కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. రాజధానికోసం భూసేకరణ చేపట్టనున్న సమయంలో భూసేకరణ చట్టం ప్రయోగించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ పాలాభిషేకం నిర్వహించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జంధ్యాల స్టైల్‌లో `పేక మేడ‌లు`

'నా పేరు శివ', 'అంధగారం', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించిన వినోద్ కిష‌న్ ఇప్పుడు హీరోగా మారాడు. ఆయ‌న న‌టించిన 'పేక మేడ‌లు' ఈనెల 19న విడుద‌ల‌కు సిద్ధంగా...

బీజేపీలో బీఆర్ఎస్ రాజ్యసభపక్షం విలీనం ?

బీఆర్ఎస్ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనం అయ్యేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లుగా ఢిల్లీలో ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరబోతున్నారు. ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతి,...
video

విజ‌య్ తెలివి.. ‘పార్టీ’ సాంగ్‌లో పాలిటిక్స్

https://www.youtube.com/watch?v=ygq_g7ceook త‌మిళ స్టార్ హీరో విజ‌య్ కొత్త‌గా పార్టీ స్థాపించిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే రాజ‌కీయ అరంగేట్రం చేయ‌బోతున్నాన‌ని, వ‌చ్చే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. రాజ‌కీయాల‌కు ముందు త‌న చివ‌రి...

పొన్నవోలు వాదన జగన్‌కైనా అర్థమవుతుందా ?

రఘురామ ఫిర్యాదుతో జగన్ తో పాటు ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కేసు నమోదయింది. ఇది తప్పుడు కేసు అని వాదించడానికి పొన్నవోలు మీడియా సమావేశం పెట్టారు. ఇందు కోసం తన టేబుల్ నిండా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close