కుర్ర హీరోతో పాయ‌ల్‌

ఆర్‌.ఎక్స్ 100తో కెర‌టంలా వ‌చ్చింది పాయ‌ల్ రాజ్‌పుట్‌. ఇప్పుడు సునామీలా విజృంభిస్తోంది. వ‌రుస సినిమాల‌తో హోరెత్తిస్తోంది పాయ‌ల్. ర‌వితేజ సినిమాలో క‌థానాయిక‌గా ఫిక్స‌యిన పాయ‌ల్‌… వెంకీమామ‌లో ఓ క‌థానాయిక‌గా న‌టించ‌బోతోంద‌ని టాక్‌. ఇవి కాకుండా మ‌రో రెండు సినిమాలు కూడా పాయ‌ల్ చేతిలో ఉన్నాయి. సీరియ‌ర్ హీరోల సినిమాల్లో క‌థానాయిక‌గా పాయ‌ల్ పేరుని ఇప్పుడు ప్ర‌ముఖంగా చ‌ర్చిస్తున్నారు.

ఇప్పుడు ఓ కుర్ర హీరోతో జ‌త క‌ట్ట‌బోతోంది. `హుషారు` సినిమాతో ఆక‌ట్టుకున్న తేజ‌స్ క‌థానాయ‌కుడిగా సి.క‌ల్యాణ్ నిర్మాణంలో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. ఇందులో పాయ‌ల్‌ని క‌థానాయిక‌గా ఎంచుకున్నారు. షూటింగ్ కూడా ఈమ‌ధ్యే మొద‌లైంది. ఆర్‌.ఎక్స్ 100 సినిమాలోలానే ఇందులో కూడా పాయ‌ల్ పాత్ర హాట్ హాట్‌గా ఉండ‌బోతోంద‌న్న‌మాట‌. ఆ సినిమాకి మించిన ఘాటు ముద్దులు, హాట్ సీన్లు ఇందులో ఉండబోతున్నాయ‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com