పాయ‌ల్ రాజ్‌పుత్ 2.ఓ

ఆర్‌.ఎక్స్ 100 తో ఆర్‌డీఎక్స్‌లా పేలింది పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఈ సినిమా ఆమెకు గంపెడు అవ‌కాశాల్ని తెచ్చిపెట్టింది. అయితే లాభ‌మేంటి? అందులో ఒక్క హిట్టూ లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా బ్రేక్ రాలేదు. గ్లామ‌ర్ రోల్స్ లో న‌టించ‌డానికి ముందుకొచ్చినా… పెద్ద‌గా ప్ర‌యోజనం లేక‌పోయింది. ఐటెమ్ సాంగులు చేసినా ఆద‌ర‌ణ క‌నిపించ‌లేదు. పాయ‌ల్ ని మ‌ర్చిపోతున్న త‌రుణంలో… ఆర్‌.ఎక్స్‌.100తో బ్రేక్ ఇచ్చిన అజ‌య్ భూప‌తినే మ‌ళ్లీ… ఆమెకు మ‌రో అవకాశం ఇచ్చాడు. `మంగ‌ళ‌వారం`తో. ఈ సినిమాలో పాయ‌ల్ నే మెయిన్ ఎట్రాక్ష‌న్‌. మ‌హా స‌ముద్రంతో.. పీక‌ల్లోతు మునిగిపోయిన అజ‌య్‌కి ఈసారి హిట్టు కొట్ట‌డం అత్య‌వ‌స‌రం. అంతేకాదు.. ఈ సినిమాతో త‌న‌నే న‌మ్ముకొన్న పాయ‌ల్ కి సైతం లైఫ్ ఇవ్వాలి.

మంగ‌ళ‌వారం ఫ‌స్ట్ లుక్ ఈరోజు విడుద‌లైంది. పాయ‌ల్ ఫ‌స్ట్ లుక్‌లో అర్థ‌న‌గ్నంగా అందాలు ఆర‌బోస్తూ క‌వ్విస్తోంది. ఆర్‌.ఎక్స్ 100లో గ్లామ‌ర్ డోస్ ఓ రేంజ్‌లో చూపించింది పాయ‌ల్. అయితే.. అదొక్క‌టే స‌రిపోద‌న్న విష‌యం త‌న‌కు ఫ్లాపుల ద్వారా తెలిసొచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కూ గ్లామ‌ర్‌ని న‌మ్ముకొన్న పాయ‌ల్.. ఇప్పుడు స‌రికొత్త రూపంలో ద‌ర్శ‌న‌మివ్వబోతోంద‌ని, ఈ సినిమాతో కొత్త పాయ‌ల్ ని చూస్తార‌ని చిత్ర‌బృందం ధీమాగా చెబుతోంది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి విడుద‌ల చేస్తున్నారు. టైటిల్‌.. ఆ హ‌డావుడీ చూస్తుంటే ఇదో హార‌ర్ సినిమా అనే అనిపిస్తోంది. విరూపాక్ష‌తో.. హార‌ర్ జోన‌ర్‌కి మంచి డిమాండ్ ఏర్ప‌డింది. ఈ ఎఫెక్ట్ మంగ‌ళ‌వారం చిత్రంపైనా ప‌డితే, ఈ సినిమాతో అజ‌య్‌, పాయ‌ల్ ఇద్ద‌రూ గ‌ట్టెక్కేసిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close