సుకుమార్ స్క్రీన్ ప్లేకి రూ.6 కోట్లు

సుకుమార్ రైటింగ్స్ నుంచి వ‌చ్చిన మ‌రో సినిమా విరూపాక్ష‌. ఈ క‌థ‌కి సుకుమార్ స్క్రీన్ ప్లే అందించ‌డ‌మే కాకుండా… ప్రాజెక్ట్ సెట్ చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఈ క‌థ‌ని సాయిధ‌ర‌మ్‌కి వినిపించి, నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్‌ని లింక్ చేశాడు సుకుమార్‌. క‌థ‌లో సుక్కు మార్క్ క‌నిపించ‌క‌పోయినా, కీల‌క‌మైన మ‌లుపుల విష‌యంలో సుకుమార్ స‌లహాలు బాగా ప‌నిచేశాయి. విడుద‌ల‌కు ముందే మంచి బిజినెస్ జ‌రుపుకొంది. దాంతో… సుకుమార్ వాటాగా రూ.6 కోట్లు ద‌క్కించుకొన్నాడు. ఈ సినిమా కోసం సుకుమార్ పెట్టిన పెట్టుబ‌డి… త‌న తెలివితేట‌లే. ఇప్పుడు సినిమా హిట్ట‌య్యింది. సాయిధ‌ర‌మ్ తేజ్ కెరీర్ లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ కూడా అంతే. భీమ్లా నాయ‌క్ చిత్రాన్ని సెట్ చేసి, సంభాష‌ణ‌లు అందించాడు. ఈ సినిమాకి గానూ త్రివిక్ర‌మ్ కి రూ.10 కోట్లు ద‌క్కాయి. ఇప్పుడు సుకుమార్ వంతు వ‌చ్చిందంతే! ఈ యేడాది సుకుమార్ నుంచి మ‌రో ఇద్ద‌రు శిష్యులు మెగా ఫోన్ ప‌ట్ట‌బోతున్నార‌ని టాక్‌. అందులో ఓ లేడీ డైరెక్ట‌ర్ ఉంద‌ట‌. ఇక నుంచి ప్ర‌తీ యేడాది సుకుమార్ రైటింగ్స్ నుంచి రెండు సినిమాలు చేయాల‌ని, ఇద్ద‌రు శిష్యుల‌ను ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌యం చేయాల‌ని ఫిక్స‌య్యాడ‌ట సుక్కు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close