టాలీవుడ్ ఒక మంచి డీల్ సెట్ అయ్యింది. దర్శకుడు రమేష్ వర్మ, బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ తో కలిసి ఏకంగా నాలుగు సినిమాలు తెరకెక్కించేందుకు భారీ డీల్ కుదుర్చుకున్నారు. ఈ నాలుగు చిత్రాల మొత్తం బడ్జెట్ సుమారు రూ.150 కోట్లని సమాచారం. ఇటీవల కాలంలో ఒక బాలీవుడ్ సంస్థతో ఒక తెలుగు దర్శకుడు ఇంత పెద్ద స్థాయిలో ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే తొలిసారి.
ఈ నాలుగు సినిమాలకు సంబంధించిన హీరోల ఎంపిక కూడా దాదాపుగా ఖరారైంది. కోలీవుడ్ స్టార్ విక్రమ్, ద్రువ్, లారెన్స్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ లతో ఈ నాలుగు సినిమాలు ఫిక్సయ్యాయని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కథలు ఇప్పటికే దాదాపుగా ఫైనల్ అయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటనలు కూడా వెలువడనున్నాయని టాక్. ఈ నాలుగు కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్. ఈ నాలుగు సినిమాల అధికారిక ప్రకటనలు, టైటిల్స్, టెక్నికల్ టీమ్ వివరాలు త్వరలోనే రివిల్ చేస్తారు. రమేష్ వర్మ తో కలిసి మొత్తమ్మీద పది ప్రాజెక్టులు రూపొందించాన్నది ప్లాన్. తొలి విడతగా 4 సినిమాలు ఖరారు చేసుకొన్నారు.
మరోవైపు రమేష్ వర్మ `కొక్కొరొక్కో` అనే ఓ చిన్న సినిమాని రూపొందించారు. ఈ చిత్రానికి ఆయన నిర్మాత. షూటింగ్ పూర్తయ్యింది. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన `కిల్`ని రీమేక్ చేసే పనుల్లో ఉన్నారు రమేష్ వర్మ. ఈ స్క్రిప్టు వర్కు కూడా పూర్తయ్యింది.
