పుష్కరాలకు పోటెత్తిన భక్తులు: హైవేలపై గంటలపాటు ట్రాఫిక్ జామ్‌లు

హైదరాబాద్: శని, ఆదివారాలు వరసగా సెలవులు రావటంతో తెలుగు రాష్ట్రాలు రెండింటిలో గోదావరి పుష్కరాలకు జనం పోటెత్తారు. అటు ఏపీలో రాజమండ్రి, కొవ్వూరు, నరసాపురం, పాలకొల్లులలోని పుష్కర ఘాట్‌లు, ఇటు తెలంగాణలో  అదిలాబాద్ జిల్లాలోని బాసరనుంచి ఖమ్మంజిల్లాలోని భద్రాచలంవరకు ఉన్న పుష్కర ఘాట్‌లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అంచనాలకు మించి ప్రయాణీకులు వస్తుండటంతో రెండు రాష్ట్రాలలోనూ అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేయటానికి కిందా మీదా పడుతోంది. ఇదంతా ఒక ఎత్తైతే మరోవైపు పుష్కరఘాట్‌లకు వెళ్ళే జాతీయ రహదారులపై విపరీతంగా ఏర్పడుతున్న ట్రాఫిక్ జామ్‌లు పుష్కరాలకు బయలుదేరిన భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. బస్సులు, రైళ్ళు పుష్కర భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దానికితోడు వ్యక్తిగత వాహనాలుకూడా లక్షలసంఖ్యలో రోడ్డెక్కాయి. పలువురు వీఐపీలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి, ఇటు హైదరాబాద్-నిజామాబాద్ హైవేలపై ట్రాఫిక్ విపరీతంగా ఉంది. రాజమండ్రి దగ్గరయితే ఒకదశలో ఆరు కిలోమీటర్లమేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.టోల్ గేట్లు, చెక్ పోస్టులవద్ద వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోవటంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టోల్ గేట్లవద్ద టోల్ వసూళ్ళు నిలిపేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛందసంస్థలు సహాయానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కూడా టోల్ గెేట్లవద్ద నిలవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇవాళ ఉదయం పుష్కరాలకు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్‌లవద్ద 24గంటలూ గజఈతగాళ్ళను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రోడ్లపై రద్దీ క్లియరెన్స్‌కు చర్యలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాలద్వారా మళ్ళించాలని సూచించారు. ధర్మపురి, కాళేశ్వరం, ఏటూరునాగారం, భద్రాచలం రహదారులలో ఎక్కడి కక్కడ పలుసార్లు ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీలో “వన్ ఇయర్” మార్పు..! సజ్జలే నెంబర్ టూ..!?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ ఎవరు అంటే.. అందరూ.. ఎంపీ విజయసాయిరెడ్డి పేరును మొదటి ఆప్షన్‌గా పెడతారు. ఎందుకంటే.. అంత క్రియాశీలకంగా ఉంటారు ఆయన. అటు ఢిల్లీలో పరిస్థితుల్ని...

బీజేపీ గవర్నరేగా సంతకం పెట్టింది..! ఎలా స్వాగతిస్తున్నారు..?

ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్‌ను తొలగిస్తూ.. తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని..హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ నేతలు కూడా.. పోటీలు పడి స్వాగతించారు. ఢిల్లీలో జీవీఎల్ నరసింహారావు దగ్గర నుంచి...

ఫిరాయించిన ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు..!?

మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లు విషయంలో మండలిలో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయకుండా.. వైసీపీ గూటికి చేరిపోయిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డిలపై అనర్హతా వేటు వేయడానికి టీడీపీ రంగం సిద్ధం చేసుకుంది....

ఏడాది యాత్ర 11 : అంచనాలు ఎక్కువ… ఆచరణ తక్కువ..!

ఇంత ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ తట్టులేకపోతున్నాను భయ్యా..! .. అంటాడు ఓ సినిమాలో హీరో. నిజంగానే ఆ సినిమాకు హైప్ ఓ రేంజ్‌లో వచ్చింది. ఎంతగా అంటే.. సినిమా ఎంత అద్భుతంగా తీసినా .....

HOT NEWS

[X] Close
[X] Close