జగన్ ఎప్పుడో పాదయాత్ర చేసి ఎనిమిదేళ్లు అయిందని వైసీపీ నేతలు సంబరాలు చేయాలని సజ్జల ఆఫీసు నుంచి మెసెజులు రావడంతో ఓపిక ఉన్న వాళ్లు చేశారు. ఇలాంటి విషయాల్లో ముందు ఉండే పేర్ని నాని కూడా చేశారు. మళ్లీ జగన్ రెడ్డి పాదయాత్ర చేస్తారని ప్రకటించారు. 2027లో పాదయాత్ర ఉంటుందని ప్రకటించారు. అంటే ఇంకా రెండేళ్లు ఉందన్నమాట. అప్పటికి జగన్ రెడ్డి జైల్లో ఉంటారో.. కాంగ్రెస్ కూటమిలో ఉంటారో ఎవరికీ తెలియదు.
జగన్ రెడ్డి ప్రజల్లోకి రావడం లేదు. వారానికి రెండు, మూడురోజులు తాడేపల్లికి వచ్చి చెప్పిందే చెప్పి పోతున్నారు. ఎప్పుడైనా రోడ్డు మీదకు వెళ్తే పెద్ద డ్రామా క్రియేట్ చేస్తున్నారు. అంతే తప్ప ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం లేదు. గతంలో ఊరూరా వస్తా.. కార్యకర్తలను కలుస్తా అని చెప్పారు. కానీ చివరికి హ్యాండిచ్చారు. తాను ఎప్పుడు అలా చెప్పానన్నట్లుగా మాట్లాడుతున్నారు.
ఈ రెండేళ్లు కూడా రెస్ట్ తీసుకుని పాదయాత్రతోనే ప్రజల్లోకి రావాలని ఆయన అనుకుంటున్నారు. అప్పటి వరకూ రెస్ట్ తీసుకుంటారు. పాదయాత్రకు ఇప్పటి నుంచే ప్రచారం కల్పించేందుకు పేర్ని నాని ప్రయత్నిస్తున్నారు.కానీ గతంలోలా ఈ సారి పాదయాత్ర చేయడం సాధ్యం కాదని వైసీపీ నేతలంటున్నారు. జగన్ కు అంత ఓపిక లేదని…అసలు ప్రజల్లోకి రారని అంటున్నారు. ప్రస్తుతం ఆయన బద్దకం చూస్తే అదే నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి.