కేసీఆర్ అడ్డుకోబోయినా ఆర్టీసీని విలీనం చేశారట..!?

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను.. జగన్మోహన్ రెడ్డి ఆత్మీయుడిగా చూస్తూంటారు… అయితే లోపల మాత్రం వేరేలా అనుకుంటూ ఉంటారని..ఆయన సలహాలేవీ పాటించకూడదని అనుంకుంటారని.. మంత్రి పేర్ని నాని పరోక్షంగా చెప్పారు. దానికి ఆర్టీసీ విలీనం కథను చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి .. గతంలో కేసీఆర్‌ను కలిసినప్పుడు.. ఆర్టీసీని విలీనం చేయవద్దని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వం భరించడం గుదిబండ అని ..చాలా పొరపాటు చేస్తున్నావని కూడా జగన్‌తో అన్నారట.కానీ.. జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా.. కేసీఆర్ చెప్పినందుకైనా సరే.. చేసి చూపించాలన్న ఉద్దేశంతో .. విలీనం చేశారని.. పేర్ని నాని చెప్పుకొచ్చారు.

గతంలోనూ ఆర్టీసీ విలీనానికి.. కేసీఆర్‌కు ముడిపెట్టి .. పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు. తాము.. ఎంత గొప్ప పని చేశామో .. చెప్పడానికి.. కేసీఆర్ ను ఉదాహరణకు .. పేర్ని నాని పదే పదే చెప్పడానికి ప్రయత్నించడంపై.. వైసీపీ నేతల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. జగన్ – కేసీఆర్ మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణనూ.. పేర్ని నాని…బయట పెట్టడం ఏమిటన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్… ఆర్టీసీని విలీనం చేయకూడదనుకున్నారు. ఆ సంస్థను ఆ సంస్థలాగే ఉంచాలనుకున్నారు. ఆయన విధానం ఆయన ఫాలో అయ్యారు. ఆత్మీయుడు కదా.. అని ఓ సలహా ఇచ్చి ఉంటారు.. దానికి ఆయనేదో.. అడ్డుకోబోయారని.. దాన్నే సవాల్‌గా తీసుకుని జగన్ విలీనం పూర్తి చేశారని.. కార్మికుల ముందు పేర్ని నాని గొప్పలకు పోవడం.. కలకలం రేపుతోంది.

ఆర్టీసీని విలీనం చేయడానికి తాము ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నామని చెప్పే ఉద్దేశంతోనే… కేసీఆర్ ప్రస్తావన పదే పదే పేర్ని నాని తెస్తున్నారని భావిస్తున్నారు. ఆయన చేయకున్నా… ఆయన వద్దని చెప్పినా.. తాము చేశామన్న అభిప్రాయాన్ని కార్మికుల్లో కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా… ఇప్పటికీ కార్మికులు అసంతృప్తిగా ఉన్నారు. పెన్షన్, ఇతర సౌకర్యాలపై క్లారిటీ లేకుండా పోయింది. అందుకే కార్మికులు ఆందోళన బాట పడుతున్నారు. వీరిని బుజ్జగించడానికి.. పేర్ని నాని కేసీఆర్‌ను వాడుకుంటున్నారన్న అభిప్రాయం కార్మికుల్లో ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close