రాజమౌళి కలిశాక ఆర్ఆర్‌ఆర్‌ టిక్కెట్‌కు మరో రేటు – పేర్ని నాని రివర్స్ !

రాజమౌళి కలవక ముందు ఓ రేటు.. కలసిన తర్వాత మరో రేటు ఉండదంటూ మూడు రోజుల కిందట డైలాగులు కొట్టిన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని.. ఇప్పుడు నాలుక మడతేశారు. ఇప్పుడు ఆర్ ఆర్ఆర్ టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఎంత పెంచుకోవాలనే ఫైల్ సీఎం దగ్గరకు వెళ్తుందని ఆయన నిర్ణయం మేరకు ప్రకటన వస్తుందన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు రెమ్యూనరేషన్లు కాకుండానే రూ.336 కోట్లు ఖర్చు అయినట్లుగా చిత్ర టీమ్ దరఖాస్తులో పేర్కొన్నారని.. ఆ మేరకు టీడీఎస్, జీఎస్టీ కూడా వారు చెల్లించారని పేర్ని నాని ప్రత్యేకంగా మీడియాకు చెప్పారు. దీనిపై జీఎస్టీ డిపార్ట్ మెంట్, ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, హోం సెక్రటరీ అందరూ స్క్రూటినీ చేస్తున్నారు. త్వరలోనే ఆ ఫైల్ సీఎం వద్దకు వెళ్తుంది.

నిర్మాణ వ్యయానికి తగ్గట్లుగా టికెట్ రేట్లు ఎంత ఖరారు చేయాలనే అంశాన్ని నిర్ణయిస్తామన్నారు. పది రోజుల వరకూ టిక్కెట్ రేట్లు పెంచుకోవచ్చన్నారు. ఐదు షోల విషయంలోనూ పేర్ని నాని మాట మార్చేశారు. ఐదు షోలకు అనుమతిఇస్తాం కానీ ఓ చిన్న సినిమాను ఓ షో ఖచ్చితంగా ప్రదర్శించాలని చెప్పారు. కానీ.. ఇప్పుడు మరో కొత్త రూల్ ప్రకారం చెప్పారు.. అదేమిటంటే… పెద్ద సినిమా రిలీజయినప్పుడు చిన్న సినిమా రిలీజయితేనే ఆ షో .., ఆ సినిమాకు ఇవ్వాలి. లేకపోతే ఐదు షోలు.. ఆర్ ఆర్ ఆర్ నేప్రదర్శించుకోవచ్చన్నమాట. ఈ లెక్క ప్రకారం ఐదు షోలు ప్రదర్శిచుకునేందుకు ఆర్ఆర్ఆర్‌కు అవకాశం లభిస్తుంది.

మొత్తానికి ప్రభుత్వ పెద్దలు తల్చుకుంటే.. ఎలాంటి నిబంధనలైనా పెట్టగలరు..వావాలనుకుంటే వాటిల్లో బొక్కలు పెట్టగలరని మరోసారి నిరూపితమైంది. ఇప్పటికే ఒక్కో టిక్కెట్‌కు రూ. వంద వరకూపెంచుకునేందుకు అనుమతి ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇంకా సీఎం సంతకం పెట్టలేదని పేర్ని నాని చెబుతున్నారు. చివరికి సినిమా వాళ్లు ముఖ్యమంత్రి స్థాయిలో బతిమాలుకుంటే తప్ప టిక్కెట్ రేట్లు ఖరారు చేసుకోలేని పరిస్థితి ఏర్పపడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండు నియోజకవర్గాల సమీక్షతోనే అలసిపోయారా !?

సీఎం జగన్ ఏదీ ప్రారంభించినా ఆర్భాటంగానే ఉంటుంది. కానీ తర్వాతే దాని గురించి అసలు పట్టించుకోరు. ప్రభుత్వ కార్యక్రమం అయినా.. పార్టీ కార్యక్రమం అయినా అంతే. నియోజకవర్గాల సమీక్షలను యాభై మంది కార్యకర్తలతో...

ఆ తిప్పలు టీచర్లకే కాదు.. త్వరలో ఉద్యోగులందరికీ !

ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. టీచర్లకు కొత్తగా సెల్ఫీ అటెండెన్స్‌ను తీసుకు వచ్చారు. తమ సొంత ఫోన్‌లో ప్రభుత్వం చెప్పిన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని.. ఆ యాప్‌లో...

మ‌హేష్ – త్రివిక్ర‌మ్‌… ఇంత ఫాస్ట్ గానా?

అగ్ర హీరో సినిమా అంటే క‌నీసం ప్రొడ‌క్ష‌న్ కోసం యేడాది కేటాయించాల్సిందే. త్రివిక్ర‌మ్ లాంటి డైరెక్ట‌ర్ అంటే.... ఇంకా ఎక్కువ టైమే ప‌డుతుంది. ఎందుకంటే త్రివిక్ర‌మ్‌కి ఏదీ ఓ ప‌ట్టాన న‌చ్చ‌దు. మేకింగ్...

ఇక మోడీ టార్గెట్ రాజ్‌నాథ్ !

నరేంద్రమోదీ , అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో కిందా మీదా పడుతున్నప్పుడు వారంతా బీజేపీని నడిపించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఎప్పుడైనా మోదీ ప్రధాని అభ్యర్థి అవడానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close