ఏపీ లిక్కర్ స్కామ్ లో జగన్ రెడ్డి అరెస్ట్ అవ్వక తప్పదా? అంటే అవుననే అంటున్నారు మాజీమంత్రి , వైసీపీ నేత పేర్ని నాని. లిక్కర్ స్కామ్ లో సిట్ మరింత దూకుడు పెంచడంతో వైసీపీలో అలజడి ఎక్కువైంది. ఈ కేసులో జగన్ కు అత్యంత సన్నిహితులైన నేతలు, అధికారులు అరెస్ట్ అవుతుండటంతో కేసు వ్యవహారం జగన్ ను త్వరలోనే చుట్టేస్తుందని పేర్ని నాని అంచనా వేస్తున్నారు.
జగన్ ను తప్పనిసరిగా అరెస్ట్ చేస్తారని తేల్చేశారు పేర్ని నాని. లిక్కర్ స్కామ్ లో జగన్ పాత్ర ఏమిటి అన్నది త్వరలోనే తేలుతుంది. ఇప్పటికే ఎవరెవరికి ముడుపులు అందాయి, వాటిని హవాలా రూపంలో విదేశాలకు ఎలా తరలించారు అనే వివరాలను సిట్ సేకరించినట్లుగా సమాచారం. నిందితుల నుంచి సిట్ మరిన్ని వివరాలు రాబడుతున్నట్లుగా తెలుస్తోంది.
జగన్ సన్నిహిత అధికారుల అరెస్ట్ తో మరికొద్ది రోజుల్లోనే జగన్ అరెస్ట్ తథ్యం అనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు నిందితులు లిక్కర్ స్కామ్ లో తమకు పైనుంచి వచ్చిన ఆదేశాలతోనే ఇదంతా చేశామని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే జగన్ రెడ్డికి నోటీసులు ఇచ్చి మరికొద్ది రోజుల్లోనే విచారణకు పిలవడం తథ్యం. దీంతో ఆయన అరెస్ట్ ఖాయమని పేర్ని నాని ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోంది.
అయితే, లిక్కర్ స్కామ్ లో జగన్ ఎలాంటి పాత్ర పోషించారో క్లియర్ గా ఉంది. దాంతో ఆయన అరెస్ట్ ను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే అంశంపై వైసీపీ అప్పుడే ప్రిపేర్ అవుతున్నట్టు పేర్ని నాని డైలాగ్స్ ఉన్నాయి. జగన్ కు లిక్కర్ స్కామ్ మరకలు అంటకుండా ఉండేలా డైలాగ్ లు రెడీ చేస్తున్నట్టు కనిపిస్తోంది.
స్కిల్ కేసులో చంద్రబాబు 53 రోజులు జైలులో ఉన్నారని, దాంతో జగన్ ను ఒక్కరోజైనా జైల్లో ఉంచాలని ఈ లిక్కర్ కేసును నడుపుతున్నారన్నారు.మొత్తంగా పేర్ని నాని కామెంట్స్ చూస్తుంటే జగన్ అరెస్ట్ ఖాయమని చెప్పినట్లుగా ఉందని వాదనలు వినిపిస్తున్నాయి.