వల్లభనేని వంశీ చావు గురించి వైసీపీ మాట్లాడేస్తోంది. పేర్ని నాని నిర్మోహమాటంగా వంశీ చనిపోతాడన్నట్లుగా మీడియా ముందు చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. మరో వైపు తీవ్ర అనారోగ్యమని ఆయన పదే పదే ఆస్పత్రికి తీసుకెళ్లమని కోరుతున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లి అన్ని టెస్టులు చేయిస్తే అక్కడ ఏమీ ఉండటం లేదు. కావాలని అనారోగ్యం పేరుతో నాటకాలాడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు కొత్తగా వంశీ మరణం అంటూ పేర్ని నాని కొత్త నాటకాలు ప్రారంభించారు. శవాల రాజకీయంలో పండి పోయిన వైసీపీ ఏమైనా చేస్తుందని జైల్లో వంశీకి భద్రత పెంచాలన్న డిమాండ్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. తమ పార్టీ నాయకుడి ప్రాణం గురించి ఇంత ఈజీగా పేర్ని నాని ఎలా మాట్లాడేస్తున్నారో కానీ.. ఆయన మాటల తీరుపై మాత్రం అనుమానాలు ప్రారంభమయ్యాయి.
రేపు కొడాలి నానిని అరెస్టు చేసినా ఇదే తరహాలో రచ్చ చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో వైసీపీ హయాంలో కరోనా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా కేసుల్లోనే వృద్ధులను అరెస్టు చేసి కావాలని కరోనా అంటించేలా తిప్పి వదిలిపెట్టేవారనిన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి సోషల్ మీడియా అరెస్టుల్లో కరోనా అంటుకుని కొంత మంది చనిపోయారు కూడా. ఇప్పుడు విపక్షంలో ఉండి.. ఘోరమైన నేరాలు చేసిన వంశీ లాంటి వాళ్లను జైల్లో పెడితే చచ్చిపోతాడని రెచ్చిపోతున్నారు.