పిక్ టాక్‌: ఎన్టీఆర్‌.. చ‌ర‌ణ్‌.. డాన్సింగ్ మేళా

టాలీవుడ్ లో ది బెస్ట్ డాన్స‌ర్లంటే.. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల పేర్లు చెప్ప‌కుండా ఉండ‌లేం. టాప్ 1 స్థానానికి వీరిద్ద‌రి మ‌ధ్యా గ‌ట్టి పోటీ ఉంది. ఎన్టీఆర్ స్టెప్పుల్లో మాస్ ఉంటుంది. చ‌ర‌ణ్ లో గ్రేస్ ఉంటుంది. ఎవ‌రు డాన్స్‌వేసినా.. చూడ్డానికి రెండు క‌ళ్లూ చాల‌వు. అలాంటిది.. ఇద్ద‌రూ ఒకే సారి.. ప‌క్క ప‌క్క‌న చేరి పాదం క‌దిపితే…? ఇక చెప్పేదేముంది? ఆర్‌.ఆర్‌.ఆర్‌లో ఈ డాన్సింగ్ స్టార్స్ ని ప‌క్క ప‌క్క‌నే చూడ‌బోతున్నాం. ఈ సినిమాలోని రెండో పాట‌ని ఈనెల 10న విడుద‌ల చేయ‌బోతోంది చిత్ర‌బృందం. ఇదో డాన్స్ నెంబ‌ర్‌. కోమ‌రం భీమ్‌, అల్లూరి సీతారామ‌రాజు పోటా పోటీగా స్పెప్పులు వేయ‌బోతున్నారిక్క‌డ‌. దానికి సంబంధించిన స్టిల్ కూడా చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. `నాటు నాటు` అంటూ సాగే ఈ పాట‌లో… ఇద్ద‌రు హీరోలూ.. నాటు స్టెప్పులు వేయ‌బోతున్నార‌ని స్టిల్ చూస్తే అర్థ‌మైపోతోంది. నిజానికి ఎన్టీఆర్ – చ‌ర‌ణ్ ఇందులో నువ్వా? నేనా? అనే త‌ర‌హా పాత్ర‌లు పోషిస్తున్నారు. వాళ్ల మ‌ధ్య వైరాన్ని చూపించే షాట్స్ ఇంత వ‌ర‌కూ టీజ‌ర్లో క‌నిపించాయి. ఇద్ద‌రి మ‌ధ్యా దోస్తీ చూపించే గీతం ఇది. మ‌రి డాన్సింగ్ లో మేటి అనిపించుకుంటున్న వీరిద్ద‌రూ క‌లిసి క‌దం క‌దిపితే.. బాక్సాఫీసు బ‌ద్ద‌లు కాకుండా ఎలా ఉంటుంది? ఆ డాన్స్ ఫీస్ట్ చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close