పీలేరు రివ్యూ : నల్లారి ఫ్యామిలీపై సానుభూతి పవనాలు !

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి పెట్టని కోట లాంటి నియోజకవర్గం పీలేరు. కానీ కిరణ్ రాజకీయ తప్పిదాలతో ఆ కోటను కోల్పోయారు. గత రెండు ఎన్నికల్లో ఓడజిపోయారు. కిరణ్ బీజేపీలో ఉన్నారు. కానీ ఆయన నాన్ ప్లేయింగ్ కెప్టెన్. ఎప్పుడూ బయట కూడా కనిపించరు. ఆయన సోదరుడు టీడీపీలో చేరి రాజకీయం చేస్తున్నారు. ఆయనే అభ్యర్థి కూడా. రెండు సార్లు ఓడిన ఆయన ఈ సారి గెలిచి తీరాలన్న పట్టదలతో ఉన్నారు. చంద్రబాబు మొదటి జాబితాలోనే టిక్కెట్ ఖరారు చేశారు. వైసీపీ అభ్యర్థిని మార్చే ఆలోచనలో ఉంది. అయితే అభ్యర్థి ఎవరైనా … పెద్దిరెడ్డిదే రాజకీయం. అక్కడ వైసీపీ ఓడిపోతే పెద్దిరెడ్డి ఓడిపోయినట్లే.

1994 తర్వాత పీలేరులో గెలవని టీడీపీ

పీలేరు నియోజకవర్గంలో 1994కు ముందు ఇక్కడ టీడీపీ హవా నడిచింది. కానీ ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క ఎలక్షన్ లోనూ పీలేరులో తెలుగుదేశం పార్టీ గెలవలేకపోయింది. కానీ ఎప్పుడూ ఘోర పరాజయం ఎదురు కాలేదు. ప్రతీ సారి స్వల్ప తేడాతోనే ఓడిపోతూ వస్తోంది. వాయల్పాడుగా ఉన్న నియోజకవర్గాన్ని 2009లో పీలేరులో కొన్ని భాగాలు కలిపి కొత్త నియోజకవర్గంగా మార్చారు. నల్లారి అమరనాథరెడ్డి ఇక్కడి ప్రజల మన్ననలు పొందారు. ఆయన హఠాన్మరణంతో..ఆయన కుమారుడు నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన సీఎం అయ్యే వరకూ సోదరులు తెర వెనుకే ఉన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ “జై సమైక్యాంధ్ర పార్టీ” పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేసి పోటీ చేశారు. కానీ.. సొంత నియోజకవర్గం పీలేరులోనూ విజయం సాధించలేకపోయారు. రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత నల్లారి సోదరులు రాజకీయంగా వేరు బాట పట్టారు. సోదరుడు కిషోర్ టీడీపీలో చేరారు. కిరణ్ కాంగ్రెస్, బీజేపీల్లో చేరినా ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

నల్లారి కుటుంబంపై ప్రజల్లో సానుభూతి !

పీలేరు నియోజకవర్గంలో పీలేరు, కలికిరి, కలకడ, కేవీపల్లె, గుర్రంకొండ, వాల్మీకిపురం మండలాలు, 293 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. మొత్తం ఓటర్లు రెండున్నర లక్షల మంది వరకూ ఉన్నారు. నల్లారి కుటుంబంపై ప్రజల్లో అభిమానం ఉంది. కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు.. నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. వైసీపీ అభ్యర్థి పేరుకు… చింతల రామచంద్రారెడ్డే కానీ.. ఆయనకు… కర్త, కర్మ, క్రియ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే. నల్లారి కుటుంబంతో అనాదిగా తమకున్న రాజకీయ వైరం కారణంగా పెద్దిరెడ్డి కుటుంబం చింతలను అన్ని విధాలా ప్రోత్సహిస్తోంది. ఆర్థిక వనరులు సహా.. ఎలక్షనీరింగ్ కూడా పీలేరులో పెద్దిరెడ్డే చూసుకుంటారు. 2019 ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చింతల రామచంద్రారెడ్డి 49 శాతం ఓట్లు సాధించారు. అటు టీడీపీ నుంచి పోటీ చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి 45 శాతం ఓట్లు వచ్చాయి. ఇక ఇతరులు 6 శాతం ఓట్లు సాధించారు.

స్వల్ప తేడాతో రెండు సార్లు ఓడిపోవడంతో నల్లారిపై ప్రజాభిమానం

నల్లారి కిషోర్ స్వల్ప తేడాతో రెండు సార్లు ఓడిపోయారన్న సానుభూతి నియోజకవర్గంలో కనిపిస్తోంది. వైసీపీ నేతలు, కార్యకర్తలపై అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. రెండు సార్లు ఓడినా నల్లారి కిషోర్ ప్రజల్లోనే ఉన్నారు. ఫార్టీ కార్యక్రమాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లారు. టీడీపీ-జనసేన పొత్తుతో 15 శాతం వరకూ ఉన్న బలిజ ఓటర్ల మద్దతు ఏకపక్షంగా వచ్చే అవకాశం ఉంది. పీలే టీడీపీ అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డి గతంలో రెండుసార్లు ఓడిన సానుభూతి, జనసేనతో పొత్తు కూడా టీడీపీ అభ్యర్థికి కీ రోల్ పోషించబోతున్నట్లు అర్థం చేసుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ వెదుకులాట!

బీఆర్ఎస్ ను చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది....

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న జోరు చూపిస్తోంది. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టాక‌, ఆ ఉత్సాహం మ‌రింత‌గా పెరిగిపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కాలు పెడుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జోడీ క‌ట్ట‌డానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close