దుల్క‌ర్‌, అడ‌విశేష్.. ఓ మ‌ల్టీస్టార‌ర్‌!

టాలీవుడ్ లో మ‌ల్టీస్టార‌ర్ల జోరు ఎక్కువైంది. ఇద్ద‌రు, ముగ్గురు హీరోలు క‌లిసి న‌టించ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ద‌ర్శ‌కులు కూడా రెండు భాష‌ల‌కు చెందిన స్టార్ల‌తో సినిమాలు చేయ‌డానికి మ‌క్కువ‌గా ఉన్నారు. అందులో భాగంగా మ‌ల‌యాళం నుంచి దుల్క‌ర్ స‌ల్మాన్.. తెలుగు నుంచి అడ‌విశేష్‌ల‌ను క‌లిపి ఓ మ‌ల్టీస్టార‌ర్ రూపొందించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం అవుతున్నాయి. ప‌ర‌శురామ్ ద‌గ్గ‌ర శిష్య‌రికం చేసిన ఓ యువ ద‌ర్శ‌కుడు.. ఓ క‌థ రాసుకొన్నాడు. టాలీవుడ్ కి చెందిన ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఈ క‌థ చేయ‌డానికి ‘ఓకే’ అనేసింది.

అడ‌విశేష్‌, దుల్క‌ర్ అయితే కాంబినేష‌న్ ప‌రంగానూ కొత్త క్రేజ్ వ‌స్తుంద‌న్న‌ది నిర్మాత‌లు భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఇద్ద‌రు హీరోల‌కూ క‌థ‌లు వినిపించే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ఇద్ద‌రు హీరోలూ త‌మ నిర్ణ‌యాన్ని తెలియ‌జేయాల్సివుంది. అడ‌విశేష్, దుల్క‌ర్ ఇద్ద‌రూ క‌థ‌ల విష‌యంలో చాలా కేర్ తీసుకొంటారు. కొత్త కొత్త జోన‌ర్లు ట్రై చేస్తుంటారు,. ఇద్ద‌ర్నీ ఒకే ఫ్రేమ్‌లో చూడ‌డం నిజంగా క‌నుల పండ‌గే. తెలుగులో దుల్క‌ర్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. ‘సీతారామం’తో ఓ క్లాసిక్ హిట్ కొట్టాడు. ఇప్పుడు తేజా స‌జ్జా హీరోగా న‌టిస్తున్న చిత్రంలోనూ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ నిర్మిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close