పింక్ రీమేక్‌… ఇంకా టైముంద‌ట‌!

ప‌వ‌న్ క‌ల్యాణ్ చేయాల్సిన సినిమాల్లో `పింక్‌` రీమేక్ ఒక‌టి. దిల్‌రాజు ద‌గ్గ‌ర ఈ రైట్స్ ఉన్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ఈ సినిమా చేయాల‌ని ఆయ‌న త‌హ‌త‌హ‌లాడుతున్నాడు. ప‌వ‌న్ సినిమాల‌కు సిద్ధ‌మైన ఈ నేప‌థ్యంలో పింక్ రీమేక్ మ‌రోసారి చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చింది. ప‌వ‌న్ ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే క్రిష్ ఓ క‌థ‌తో సిద్ద‌మైపోవ‌డం, దానికి నిర్మాత (ఎ.ఎం.ర‌త్నం) కూడా రెడీ అయిపోవ‌డంతో.. పింక్ రీమేక్ కంటే ముందు క్రిష్ సినిమానే ప‌ట్టాలెక్కేఛాన్సులు క‌నిపిస్తున్నాయి.

పింక్ రీమేక్ చేసే ఆలోచ‌న ఉన్నా, దానికి స‌రైన రీతిలో దిల్ రాజు స‌న్న‌ద్ధం అవ్వ‌లేద‌ట‌. ఈ సినిమా కోసం ద‌ర్శ‌కుడ్ని ఇంకా ఎంపిక చేయ‌లేదు. తెలుగులో స్క్రిప్టు ఇంకా రెడీ అవ్వ‌లేదు. ఇవ‌న్నీ అవ‌డానికి మ‌రో నాలుగైదు నెల‌లైనా ప‌డుతుంది. ప్రీ ప్రొడ‌క్ష‌న్‌కి దిల్ రాజు ఎక్కువ స‌మ‌యం తీసుకుంటాడు. పింక్ రీమేక్‌ని ఉన్న‌ది ఉన్న‌ట్టు తీస్తే కుద‌ర‌దు. ఆల్రెడీ ఆ సినిమా అంద‌రూ చూసేశారు. క‌థ అంద‌రికీ తెలుసు. అలాంటప్పుడు క‌థ‌లో మ‌రిన్ని మార్పులు అవ‌స‌రం అవుతాయి. అవ‌న్నీ ప‌క్కాగా జర‌గాలంటే టైమ్ ప‌డుతుంది. అందుకే పింక్ రీమేక్ ఇప్ప‌ట్లో లేనట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close