ఫిబ్రవరిలో మోడీ తెలంగాణా పర్యటన?

ఫిబ్రవరి 13వ తేదీన ప్రధాని నరేంద్ర మోడి తెలంగాణా రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మీడియాకి తెలిపారు. తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినన మిషన్ కాకతీయ పైలాన్ ఆవిష్కరణ, వరంగల్ లో గిరిజన విశ్వవిద్యాలయం, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, టెక్స్ టైల్ పార్క్ ల శంఖుస్థాపన తదితర కార్యక్రమాలలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడిని ఆహ్వానించామని, అయితే ఆయన పర్యటన ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. ఒకవేళ ఖరారు అయితే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ రాష్ట్రంలో ఆయన మొట్టమొదటి పర్యటన అదే అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com